Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రోల్ మోడల్ మార్కెట్‌గా ఖమ్మం మార్కెట్
- రూ.10.35 కోట్ల వ్యయంతో నిర్మాణం
నవతెలంగాణ-ఖమ్మం కార్పొరేషన్
ఖమ్మం వ్యవసాయ మార్కెట్ రోల్ మోడల్ గా మార్కెట్‌ను చేస్తామని అభివృద్ధి పరుస్తున్నట్లు రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్, సహకార శాఖ మంత్రి యస్. నిరంజన్ రెడ్డి తెలిపారు. రూ.10.35 కోట్ల వ్యయంతో చేపట్టనున్న ఖమ్మం వ్యవసాయ మార్కెట్ అభివృద్ధి పనులకు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజరు కుమార్‌తో కలిసి గురువారం సాయంత్రం శంఖుస్థాపన చేసారు. ఈ సందర్భంగా వ్యవసాయ మార్కెట్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ రైతుల ఉత్పత్తుల విక్రయాలకు అవసరమైన సదుపాయాల కల్పనకు గాను వ్యవసాయ మార్కెట్ ను మరింత బలోపేతం చేస్తున్నామన్నారు. ఖమ్మం వ్యవసాయ మార్కెట్ ఆధునీకరణ పనులను వేగిరపర్చి త్వరగా పూర్తి చేయాలని మంత్రి తెలిపారు. కేంద్ర ప్రభుత్వ రైతు వ్యతిరేక చట్టాలను తేవాలని ఆలోచన చేసిన నేపథ్యంలో దేశవ్యాప్తంగా సుమారు 13 నెలల పాటు దేశ రైతాంగం తెలిపిన నిరసన ద్వారా కేంద్ర ప్రభుత్వం రైతువ్యతిరేక చట్టాల బిల్లును ఉపసంహరించుకుందని మంత్రి తెలిపారు. రాష్ట్రంలోని మార్కెట్ ను బలోపేతం చేసేందుకు పెద్ద ఎత్తున నిధులు కేటాయిస్తున్నామని వ్యవసాయ మార్కెట్లలో రైతులు, ట్రేడర్లు, హామాలీలకు అవసరమైన సదుపాయాలను కల్పించేందుకు వ్యవసాయ మార్కెట్లను ఆధునీకరించి మోడల్ మార్కెట్లుగా తీర్చిదిద్దుతున్నామని మంత్రి అన్నారు.
ఈ సమావేశంలో రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ మాట్లాడుతూ వరంగల్ మార్కెట్ తరువాత అతి పెద్ద మార్కెట్ ఖమ్మం వ్యవసాయ మార్కెట్.