Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వర్థంతి సభలో సీపీఐ(ఎం)జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు
నవతెలంగాణ-ఖమ్మంప్రాంతీయప్రతినిధి
వర్గ రహిత సమాజం సాధించటానికి అపర త్యాగాలకు, సుదీర్ఘ పోరాటాలకు కార్యకర్తలంతా సిద్దం కావాలని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు అన్నారు. గురువారం స్థానిక సుందరయ్య భవనంలో పార్టీ జిల్లా కమిటి సభ్యులు ఆర్.ప్రకాష్ అధ్యక్షతన జరిగిన పుచ్చలపల్లి సుందరయ్య 37వ వర్థంతి సభలో మొదట సుందరయ్య విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా విప్లవజోహార్లు అర్పించారు. అనంతరం జరిగిన సభలో నున్నా మాట్లాడుతూ వర్గరహిత సమాజం సాధించటం అంత సులభమైన పని కాదని, అనేక ఆటుపోట్లు ఎదుర్కోవాల్సి ఉంటుందని అన్నారు. పార్టీ విధానం పట్ల వినయ విధేయ తలు, నిరాడంబర జీవితం, ఎల్లప్పుడూ కార్యకర్తలకు, ప్రజలకు అందుబాటులో ఉండటం వలన ఆయన అత్యుత్తమ కమ్యూనిస్టు నాయకుడయ్యాడని ఆయన వ్యాఖ్యానించారు. ప్రజల మనిషిగా, ప్రజల కోసం చివరి వరకూ జీవించి ప్రజా పోరాటాలకు ప్రాధాన్యతని వ్వడంతోపాటు, సామాజిక పోరాటాలకు, సేవా కార్యక్రమాలకు కూడ అంతే ప్రాధాన్యతను సుందర య్య ఇచ్చాడని అన్నారు. ప్రజా ఉద్యమాలను పటిష్టపర్చేందుకు అభ్యుదయ శక్తులను, సామాజిక శక్తులను కలుపుకొని విశాల ఉద్యమాన్ని నిర్మించాలన్నారు. ఎమర్జెన్సీ సమ యంలో పార్టీని, కార్యకర్తలను కాపాడుకోవటంలో వివిధ ఎన్నికల సందర్భంగా వచ్చిన ప్రతికూల ఫలితాలలో సైతం కార్యకర్తలను నిలబెట్టడంలో సుందరయ్య కీలకపాత్ర పోషించారన్నారు.
పెరుగుతున్న ధరలకు వ్యతిరేకంగా సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో వారం రోజుల పాటు ఆందోళనలు, నిరసన కార్యక్రమాల్లో ప్రజలంతా పాల్గొని కేంద్ర ప్రభుత్వం మెడలు వంచాలని కోరారు. రాబోయే కాలంలో ప్రజా సమస్యలపై ఉద్యమాలను నిర్మించటమే సుందరయ్యకిచ్చే ఫ ున నివాళి అన్నారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు యర్రా శ్రీకాంత్, జిల్లా కమిటి సభ్యులు బండి పద్మ, పి.ఝాన్సీ, మెరుగు సత్యనారాయణ, ఎస్.నవీన్‌రెడ్డి, పిన్నింటి రమ్య, జిల్లా నాయకులు తాళ్ళ నాగరాజు, మెరుగు రమణ, కె.దేవేంద్ర, సదానందం, మాచర్ల గోపాల్, పగడాల నాగేశ్వరరావు, చింతల రమేష్, మధు, వై.శ్రీనివాసరావు, రామారావు, వాసిరెడ్డి వీరభద్రం, ఎస్.కె.అఫ్జల్ తదితరులు పాల్గొన్నారు.
ఖమ్మం : కడదాకా బడుగులకై పోరాడిన కమ్యూనిస్టు గాంధీ పుచ్చలపల్లి సుందరయ్య అని సిపిఎం రాష్ట్ర నాయకులు పీ.సోమయ్య అన్నారు. గురువారం ఖమ్మంలోని ఖానాపురం హవేలి కారల్‌మార్క్స్ ఎంటర్ప్రైస్ ఆధ్వర్యంలో పుచ్చలపల్లి సుందరయ్య వర్ధంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు . తొలుత అయన చిత్ర పటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. కార్యక్రమంలో రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులు బానోత్ కిషన్ నాయక్, సిపిఎం హవేలీ కార్యదర్శి డి.తిరుపతిరావు, కారల్ మార్క్స్ ఎంటర్ప్రైజెస్ ప్రొప్రయిటర్ పోడకంటి రాంబాబు, జీడికుంట్ల వెంకన్నబాబు, కె.ప్రభాకర్, చౌదరి, యాస్.శ్రీను, మురారి, దేవీ, కృష్ణ, గోవర్ధన్, దినేశ్, లక్ష్మి, సరస్వతి తదితరులు పాల్గొన్నారు .
ఖమ్మంరూరల్ : అమరజీవి పుచ్చలపల్లి సుందరయ్య 37 వ వర్ధంతి వేడుకలు మండలంలోని ఏదులాపురం, తల్లంపాడు, మద్దులపల్లి, జలగం నగర్, తెల్దారు పల్లి, గుదిమళ్ళ, వెంకట గిరి, ముత్త గూడెం, కాచిరాజు గూడెం తదితర గ్రామాల్లో గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏదులాపురం,తల్లంపాడు గ్రామాల్లో భారీ ర్యాలీలు నిర్వహించి సుందరయ్యకు ఘనంగా నివాళులర్పించారు.ఏదులపురం గ్రామంలో నిర్వహించిన సుందరయ్య వర్ధంతి వేడుకల్లో ముఖ్య అతిథిగా సీపీఎం జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు హాజరై ప్రసంగించారు. ఎదులాపురం గ్రామంలో మహిళలు, చిన్నారులు, యువత కోలాట నృత్యం చేస్తూ జోహార్ సుందరయ్య అంటూ నినాదాలు చేశారు. ఏదులాపురం గ్రామమంత ఎరుపు వర్ణమైంది.ఎస్సీ కాలనీలో నూతనంగా నిర్మించిన సిపిఎం దిమ్మెను నున్నా నాగేశ్వరరావు ఆవిష్కరించారు. తల్లంపాడు గ్రామంలో యువకులు భారీ సంఖ్యలో రెడ్ షర్ట్‌తో గ్రామంలో కవాతు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు బండి రమేష్, ఐద్వా జిల్లా అధ్యక్షురాలు బండి పద్మ, మండల కార్యదర్శి నండ్ర ప్రసాద్, మండల ఇంచార్జ్ ఉరడీ సుదర్శన్ రెడ్డి, మండల కార్యవర్గ సభ్యులు పి.సంగయ్య, పి.మోహన్ రావు, నందిగామ కృష్ణ, సిపిఎం సీనియర్ నాయకులు మామిండ్ల సంజీవరెడ్డి, బత్తినేని వెంకటేశ్వర రావు, సిద్దినేని కోటయ్య, ఏదులపురం సొసైటీ చైర్మన్ ఉరడీ హైమావతి, మండల నాయకులు పొన్నం వెంకటరమణ, అద్దంకి తిరుమలయ్య, పల్లె శ్రీనివాసరావు, ఏటుకురి ప్రసాద్‌రావు, డాక్టర్ రంగారావు, యామిని ఉపేందర్, నువ్వుల నాగేశ్వరరావు, రంజాన్, తాటి వెంకటేశ్వర్లు, పెంట్యాల నాగేశ్వరరావు, సంగయ్య, డివైఎఫ్ఐ మండల సహాయ కార్యదర్శి వట్టికోట నరేష్, అరవింద్, పట్టాభి, అనిష్, గడ్డం సిద్దు, చంటి, గురునాధం, దాదా, రైతు సంఘం నాయకులు మర్రి సన్మతి రావు, కృష్ణస్వామి, కర్లపూడి వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.
ఎర్రుపాలెం : పుచ్చలపల్లి సుందరయ్య జీవితం అందరికీ ఆదర్శం అని నిరాడంబరత పేదల సమస్యలపై అంకిత భావంతో పని చేయడం వంటి లక్షణాలు అందరూ అలవర్చుకోవాలని సిపిఎం మండల కార్యదర్శి దివ్వెల వీరయ్య సూచించారు. భీమవరం సిపిఎం కార్యాలయం నందు సుందరయ్య వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో సగుర్తి సంజీవరావు, గొల్లపూడి కోటేశ్వరరావు, నల్లబోతుల హనుమంతరావు, షేక్ జానీ, వెంకట నారాయణరెడ్డి, హరి నారాయణ, వీరాంజనేయులు తదితరులు పాల్గొన్నారు.
కొణిజర్ల : మండల కేంద్రంలోని సీపీఎం కార్యాలయంతో పాటు మండలంలోని సింగరాయపాలెం, కొండవనమాల, తనికెళ్ళ, తీగలబంజర, గద్దలగూడెం, పల్లిపాడు, లాలాపురం, అమ్మపాలెం, తుమ్మలపల్లి, చిన్నగోపతి, గోపవరం తదితర గ్రామాల్లో పుచ్చలపల్లి సుందరయ్య వర్థంతి వేడుకలు ఘనంగా నిర్వహించి సుందరయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో సీపీఎం మండల కార్యదర్శి చెరుకుమల్లి కుటుంబరావు జిల్లా కమిటీ సభ్యులు తాళ్లపల్లి క్రిష్ణ దోడ్డపనేని క్రిష్ణార్జున్ రావు మిద్దె రామారావు నరేష్ అంజయ్య శ్రీనివాస్ రావు అన్నారాపు వెంకటేశ్వర్లు పూల్లూరి వెంకటేశ్వర్లు చింతనిప్పు చలపతిరావు పారుపల్లి శ్రీనాథ్ కట్టా రాంబాబు తదితరులు పాల్గొన్నారు..
నేలకొండపల్లి : పుచ్చలపల్లి సుందరయ్య ఆశయసాధనకు ప్రతి కార్యకర్త ఉద్యమించాలని సిపిఎం మండల కార్యదర్శి కేపి రెడ్డి పిలుపునిచ్చారు. గురువారం నేలకొండపల్లి మండల కేంద్రంలోని స్థానిక రావెళ్ల భవనంలో మండలంలోని భైరవునిపల్లి, గువ్వలగూడెం, బోదులబండ, పైనంపల్లి తదితర గ్రామాల్లో సుందరయ్య 37వ వర్ధంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. తొలుత ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా నాయకులు గొడవర్తి నాగేశ్వరరావు, మండల కార్యదర్శి కేవీ రామిరెడ్డి, పగిడికత్తుల నాగేశ్వరరావు, మందడపు మురళీకృష్ణ, గంజికుంట్ల వెంకటయ్య, వల్లంచెట్ల భాస్కర్ రావు, కూరపాటి అప్పారావ్, కూచిపూడి శ్రీదేవి పాల్గొన్నారు.
బోనకల్ : దక్షిణ భారతదేశ కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాత అమరజీవి సుందరయ్య పూర్తితో ఉద్యమాలు నిర్వహిం చాలని సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు పొన్నం వెంకటేశ్వరరావు జిల్లా కమిటీ సభ్యులు బండారు రమేష్ పిలుపునిచ్చారు. మండల పరిధిలోని గోవిందా పురం ఎల్ గ్రామంలో సిపిఎం ఆధ్వర్యంలో పుచ్చలపల్లి సుందరయ్య 37 వర్ధంతి వేడుకలను గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రెడ్ షర్ట్లు వాలంటీర్లతో గ్రామంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీని సిపిఎం సీనియర్ నాయకులు మాదినేని నారాయణ జెండా ఊపి ప్రారంభించారు. సుందరయ్య చిత్రపటానికి పొన్నం వెంకటేశ్వరరావు, మాదినేని నారాయణ, లక్ష్మీపురం సొసైటీ అధ్యక్షులు మాదినేని వీరభద్రరావు సిపిఎం మండల కమిటీ సభ్యులు ఉమ్మినేని రవి, కళ్యాణపు శ్రీనివాసరావు తదితరులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పిం చారు. కార్యక్రమంలో సిపిఎం నాయకులు ఏడు నూతల లక్ష్మణరావు, కళ్యాణపు బుచ్చయ్య, కారంగుల చంద్రయ్య, వల్లకొండ సురేష్, తమ్మారపు లక్ష్మణ్ పాల్గొన్నారు.
ముష్టికుంట్ల వర్ధంతి సభలో బండారు రమేష్ మాట్లాడారు. కార్యక్రమంలో సిపిఎం మండల కార్యదర్శి దొండపాటి నాగేశ్వరరావు నాయకులు పిల్లలమర్రి వెంకట అప్పారావు, కందికొండ శ్రీనివాసరావు, బంధం శ్రీనివాసరావు, దొప్ప కొరివి వీరభద్రం, షేక్ నజీర్, బొడ్డుపల్లి కోటేశ్వరరావు, పిల్లలమర్రి నాగేశ్వరరావు, పిల్లలమర్రి వెంకటేశ్వర్లు, బూర్గుల అప్పా చారి పాల్గొన్నారు.
ముదిగొండ : దక్షిణ భారత కమ్యూనిస్టు ఉద్యమ నేత,మార్కిస్ట్ మహాయోధులు పుచ్చలపల్లి సుందరయ్య ఆశయసాధనకు కషి చేయాలని సిపిఐ (ఎం) మండల కార్యదర్శి బట్టు పురుషోత్తం అన్నారు. మండల పరిధిలోని మల్లన్నపాలెం గ్రామంలో సిపిఎం ఆధ్వర్యంలో గురువారం పుచ్చలపల్లి సుందరయ్య 32వ వర్ధంతి సభను నిర్వహించారు. తొలుత గ్రామంలోని రెండు సెంటర్లలో దిమ్మల వద్ద ఎర్రజెండాలు ఎగురవేసి భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం మండల కార్యదర్శి వేల్పుల భద్రయ్య, సిపిఐ(ఎం) గ్రామశాఖ కార్యదర్శ పరిటాల చుక్కయ్య, నాయకులు కోలేటి వెంకటేశ్వర్లు, తోట వీరబాబు, మారుతి సైదులు, ముద్రబోయిన చలమయ్య, మారుతి గోపి, అంగడాల ఉపేందర్, ధనియాకుల నాగులుమీరా, లింగయ్య,షేక్ పాష తదితరులు పాల్గొన్నారు.
ఖమ్మంకార్పొరేషన్ : సుందరయ్య ఆశయాల నెరవేరు స్తామని సిపిఎం జిల్లా నాయకులు శ్రీనివాస రావు అన్నారు ఈరోజు 30 డివిజన్లో సుందరయ్య పార్క్ వద్ద సుందరయ్య వర్ధంతి సందర్భంగా ముందుగా సిపిఎం సీనియర్ నాయకులు బండారు యాకయ్య జెండా ఆవిష్కరించారు. కార్యక్రమానికి షేక్ హిమామ్ అధ్యక్షత వహించారు. కార్యక్రమంలో సిపిఎం ఖమ్మం 3 టౌన్ కార్యదర్శి భూక్యా శ్రీనివాస్, రంగు హనుమంత చారి, పి ఉపేంద్ర చారి, వనమాల కృష్ణ, ఊడుగుల రవీందర్, పోచారం బిక్షం, ఎర్ర శ్రీనివాస్, భూక్య సుభద్ర, జిట్టబోయిన కాశయ్య పాల్గొన్నారు.
కారేపల్లి : అసమానతలు లేని సమాజ స్ధాపన ధ్యేయంగా అమరజీవి పుచ్చలపల్లి సుందరయ్య పని చేసి పేదల పెన్నిదిగా నిలిచారని సీపీఐ(ఎం) సోషల్ మీడియా రాష్ట్ర కోఆర్డినేటర్ పిట్టల రవి కొనియాడారు. పుచ్చలపల్లి సుందరయ్య వర్ధంతిని కారేపల్లిలోని భాగం రామనర్సయ్య భవన్లో నిర్వహించారు. కార్యక్రమంలో సీపీఐ(ఎం) జిల్లా కమిటీ సభ్యులు కే.నాగేశ్వరరావు, మండల కార్యదర్శి కే.నరేంద్ర, నాయకులు వజ్జా రామారావు, తలారి దేవప్రకాశ్, ముండ్ల ఏకాంబరం, కరకపల్లి రామయల్లు, పాసిన్ని నాగేశ్వరరావు, సీఐటీయు నాయకులు ఆరెల్లి శ్రీరాములు, శనగ రాంబాబు, కేలోత్ రవి, ఆరెల్లి రమేష్, కేతిమళ్ళ సారయ్య, రాబోతు లాలయ్య పాల్గొన్నారు.
వైరాటౌన్ : పుచ్చలపల్లి సుందరయ్య ఆశయాల సాధన కోసం ప్రజలందరు కషి చేయాలని సిపిఐ(ఎం) జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు భూక్యా వీరభద్రం పిలుపునిచ్చారు. సిపిఐ(ఎం) వైరా రూరల్ మండల కమిటీ ఆధ్వర్యంలో వైరా మండలం గన్నవరం గ్రామంలో పుచ్చలపల్లి సుందరయ్య 37వ వర్ధంతి సభను ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో సిపిఐ (ఎం) మండల కార్యదర్శి తోట నాగేశ్వరరావు, మండల కార్యదర్శివర్గ సభ్యులు బాజోజు రమణ, బి శ్రీనివాసరావు, కిలారి శ్రీనివాసరావు, మాగంటి తిరుమలరావు, నాయకులు చిత్తారి నాగరాజ, అమరనేని వెంకటేశ్వరరావు, షేక్ జానిమియా, మేడ శరబంది రుద్రాక్షల వెంకటచారి, కాసిం, ఇసాక్, మల్లయ్య, ముక్కంటి ఏసోబు, దావీదు, ప్రభాకర్, కృష్ణ తదితరులు పాల్గొన్నారు.
వైరాటౌన్ : గ్రామాలలో మారుతున్న వర్గ పొందిక ఆధారంగా ప్రజా ఉద్యమాలు ఉదతం చేయాలని సిపిఐ(ఎం) జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు బొంతు రాంబాబు అన్నారు. గురువారం సిపిఐ(ఎం) కార్యాలయం బోడేపూడి వెంకటేశ్వరరావు భవనంలో కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాత అమరజీవి పుచ్చలపల్లి సుందరయ్య 37వ వర్థంతి ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మల్లెంపాటి రామారావు అధ్యక్షతన జరిగిన సభలో బొంతు రాంబాబు మాట్లాడారు. కార్యక్రమంలో సిపిఐ(ఎం) సీనియర్ నాయకులు మల్లెంపాటి వీరభద్రం, పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు భూక్యా వీరభద్రం, పట్టణ కార్యదర్శి సుంకర సుధాకర్, సినీయర్ నాయకులు ఎస్.కె జమాల్, పారుపల్లి శ్రీనాధ్, మందడపు రామారావు, మల్లెంపాటి ప్రసాదరావు, మండల కమిటీ సభ్యులు అనుమోలు రామారావు గుడిమెట్ల రజిత, గుమ్మా నర్సింహారావు, రాచ్చభంటి బద్రిన్న, గుడిమెట్ల మెహన్ రావు, తోట కృష్ణవేణి, కిన్నెర మోతి, ఇమ్మడి వీరభద్రం, వాసిరెడ్డి విద్యాసాగర్ రావు, బెజవాడ వీరభద్రం, పల్లెబోయిన కృష్ణ, పాపగంట్టి రాంబాబు, గంటా ప్రసాద్, ఓర్స సీతారాములు, మాడపాటి రామారావు, నారాయణ రెడ్డి, నాగుల్ పాషా, దేవళ్ళ కృష్ణ తదితరులు పాల్గొన్నారు
చింతకాని : పుచ్చలపల్లి సుందరయ్యలా మనమంతా మెలగాలని అని ఆయన జీవితం తరతరాలకు ఆదర్శం అని సిపిఎం మండల కార్యదర్శి మడి పల్లి గోపాల్ రావు అన్నారు. గురువారం సుందరయ్య 37 వర్ధంతిని మండల వ్యాప్తంగా సీపీఎం శ్రేణులు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మండల కమిటీ సభ్యులు వత్సవాయి జానకి రాములు నన్నక కృష్ణమూర్తి, గడ్డం రమణ,బిల్లా లక్ష్మయ్య , నాయకులు గడ్డం కోటేశ్వరరావు కొంపల్లి శ్రీను తదితరులు పాల్గొన్నారు
బోనకల్ : భూమి లేని నిరుపేదలకు భూమి వచ్చేవరకు పోరాటాలు చేయటమే కాక, దక్షిణ భారతదేశ సిపిఎం ఉద్యమ నిర్మాత, పోరాటయోధుడు అమరజీవి పుచ్చలపల్లి సుందరయ్య అని కొనియాడారు. ప్రజా ఉద్యమాల నిర్మాణానికి అధిక ప్రాధాన్యత ఇచ్చారని సిపిఎం మండల కార్యదర్శి దొండపాటి నాగేశ్వరరావు సిపిఎం బోనకల్ గ్రామ శాఖ కార్యదర్శి తెల్లకుల శ్రీనివాస రావు అన్నారు. పుచ్చలపల్లి సుందరయ్య 37వ వర్ధంతి వేడుకలను సిపిఎం బోనకల్ గ్రామ శాఖ ఆధ్వర్యంలో గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా సుందరయ్య చిత్రపటానికి దొండపాటి నాగేశ్వరరావు, తెల్లకుల శ్రీనివాసరావు మాజీ సర్పంచ్ బుక్యా జాలు సిపిఎం బోనకల్ మాజీ శాఖ కార్యదర్శి చెన్న లక్షాద్రి బోనకల్ సొసైటీ డైరెక్టర్ బిల్లా విశ్వనాథం తదితరులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. సిపిఎం మండల కార్యాలయంలో పుచ్చలపల్లి సుందరయ్య గారి వర్ధంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా సుందరయ్య చిత్రపటానికి మండల కార్యదర్శి దొండపాటి నాగేశ్వరరావు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. కార్యక్రమంలో సిపిఎం నాయకులు ఉప్పర శ్రీను, ఏసుపోగు బాబు, బొబ్బిళ్లపాటి రాజు, నారపోగు జాన్ సైమన్ పాల్గొన్నారు.
సుందరయ్య వర్ధంతి సందర్భంగా సిపిఎం బోనకల్ గ్రామ శాఖ ఆధ్వర్యంలో మండల కేంద్రంలో గల దివ్య డయల్ వృద్ధాశ్రమంలో వృద్ధులకు సిపిఎం నాయకులు పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పుచ్చలపల్లి సుందరయ్య జీవిత విశేషాలను దొండపాటి నాగేశ్వరరావు, తెల్లకుల శ్రీనివాసరావు వివరించారు.
పెనుబల్లి : సుందరయ్య జీవితం ఉద్యమాల నిర్మాణానికి, క్రమశిక్షణ పోరాట దీక్ష అలవరచుకున్న నేతని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు మాచర్ల భారతి అన్నారు. శుక్రవారం పెనుబల్లి సిపిఎం కార్యాలయంలో పుచ్చలపల్లి సుందరయ్య 37 వ వర్ధంతి సభ ఘనంగా జరిగింది. సభకు సిపిఎం సీనియర్ నాయకులు తాండ్ర రాజేశ్వరరావు అధ్యక్షత వహించగా, సిపిఎం నాయకులు మావిళ్ళ వెంకటేశ్వరరావు సుందరయ్య చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో జిల్లా కమిటీ సభ్యులు చలమాల విట్టల్ రావు, మండల కార్యదర్శి గాయం తిరుపతిరావు, మండల కమిటీ సభ్యులు చెమట విశ్వనాథం, కండే సత్య, చలమల నరసింహారావు, గుడిమెట్ల బాబు తదితరులు పాల్గొన్నారు.
వైరాటౌన్ : పుచ్చలపల్లి సుందరయ్య స్పూర్తితో ఎర్ర జెండా నీడలో పార్టీ శ్రేణులు ప్రజా ఉద్యమాలను ఉదతంగా నిర్వహించాలని సిపిఐ (ఎం) జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు బొంతు రాంబాబు పిలుపు ఇచ్చారు. కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాత కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య 37వ వర్ధంతి సందర్భంగా సిపిఐ(ఎం) పార్టీ వైరా శాఖ ఆధ్వర్యంలో వైరా మున్సిపాలిటీ పరిధిలోని హనుమాన్ బజార్ నందు నూతనంగా నిర్మించిన పార్టీ దిమ్మెను జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు బొంతు రాంబాబు గురువారం ప్రారంభించారు. తొలుత పార్టీ జెండాను ఆవిష్కరించిన అనంతరం వైరా పట్టణ కమిటీ సభ్యురాలు గుడిమెట్ల రజిత అద్యక్షత జరిగిన సభలో బొంతు రాంబాబు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో సిపిఐ(ఎం) పట్టణ కమిటీ సభ్యులు గుడిమెట్ల మోహన్ రావు, వైరా శాఖ కార్యదర్శి ఓర్సు సీతారాములు, సభ్యులు దేవళ్ళ కష్ణ, బత్తుల ప్రమీల, దేవళ్ళ మంగా, వేముల గోపి, ఓర్పు వెంకటేశ్వర్లు, వీర్ల పిచ్చమ్మ, ఓర్పు మంగమ్మ, దండిగిరి శివకుమారి తదితరులు పాల్గొన్నారు.
వైరా : భారత కమ్యూనిస్టు పార్టీ ( మార్క్సిస్ట్) మహానేత పుచ్చల పల్లి సుందరయ్య ఆశయాలు అధ్యయనం ఎప్పటికీ అనుసరణీయమేనని సీపీఎం సీనియర్ నాయకులు పారుపల్లి కృష్ణారావు అన్నారు. మండలంలోని విప్పలమడక గ్రామంలో అమరజీవి గరిడేపల్లి వెంకటేశ్వర్లు భవన్ సీపీఎం కార్యాలయంలో సుందరయ్య వర్ధంతి నిర్వహించారు. తొలుత సుందరయ్య చిత్రపటానికి సీపీఎం సీనియర్ నాయకులు గ్రామ సర్పంచ్ తుమ్మల జాన్ పాపయ్య పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం సీపీఎం గ్రామ కార్యదర్శి కొల్లా వెంకటేశ్వర్లు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో గ్రామ మాజీ సర్పంచ్ పార్టీ సీనియర్ నాయకులు పారుపల్లి కృష్ణారావు మాట్లాడారు. కార్యక్రమంలో రైతు సంఘం మండల అధ్యక్షులు మేడా శరాబంది , చేతివృత్తుల సంఘం నాయకులు రుద్రాక్షల వెంకటా చారి, ఎదుల్ల పుల్లయ్య, గరిడేపల్లి సుబ్బారావు, రుద్రాక్షల సత్యనారాయణ, విద్యాకమిటి చైర్మన్ రుద్రాక్షల రవికుమార్, మోతిపల్లి రామారావు, బూరుగు యోహాను, ముత్తమాల బెంజి, బూరుగు కమలరాజ్, పంచాయతీ వర్కర్స్ యూనియన్ నాయకుడు దారా శ్రీను, గరిడేపల్లి సత్యం ,ముత్తామాల బిచ్చాలు పాల్గొన్నారు.
సత్తుపల్లి : అణగారిన ప్రజల పక్షాన ఉద్యమించడమే సుందరయ్యకు మనమిచ్చే ఘన నివాళి అని సీపీఐ(ఎం) జిల్లా కమిటీ సభ్యులు మోరంపూడి పాండురంగారావు అన్నారు. స్థానిక ప్రజా సంఘాల కార్యాలయంలో గురువారం ఆ పార్టీ పట్టణ కమిటీ ఆధ్వర్యంలో సుందరయ్య 37వ వర్థంతిని ఘనంగా నిర్వహించారు. కొలికపోగు సర్వేశ్వరరావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో పార్టీ పట్టణ కార్యదర్శి రావుల రాజబాబు, మీసాల వెంకటరావు, రవి, రమేశ్, బడేమియా, కరీం, జగన్నాధం, జయరాజు, వెంకటేశ్వరరావు, బాబు, హకీం, బాజీ, సైదా, హుస్సేన్, ప్రసాద్, కేశవరావు పాల్గొన్నారు.