Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పోతినేని సుదర్శన్, జూలకంటి రంగారెడ్డి
నవతెలంగాణ-కూసుమంచి
కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య, రావెళ్ళ సత్యం ఆశయాలను ముందుకు తీసుకెళ్లడమే వారికి ఇచ్చే ఘన నివాళులు అని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు పోతినేని సుదర్శన్రావు, జూలకంటి రంగారెడ్డి అన్నారు. బుధవారం సుందరయ్య 37వ వర్ధంతి సందర్భంగా మండలంలోని మల్లేపల్లి గ్రామంలో పుచ్చలపల్లి సుందరయ్య, రావెళ్ల సత్యం విగ్రహాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో వారు మాట్లాడుతూ... భారత కమ్యూనిస్టు పార్టీ(మార్క్సిస్టు) నిర్మాణంలో ఒక్కడైన సుందరయ్య నిత్యం ప్రజల కోసం పనిచేసే వారిని పేద ప్రజల కోసం తన యావదాస్తిని ధారాదత్తం చేసి పార్టీ కోసం పిల్లలు వద్దనుకుని త్యాగం చేసిన అలాంటి మహానుభావులు జీవితాలను ఆదర్శంగా తీసుకొని నేటి ముందుకు సాగాలని ఆయన అన్నారు.
ఈ దేశ రాష్ట్ర పాలకులకు రాష్ట్రం అభివృద్ధి కావాలి, రైతుల సమస్యలు పరిష్కారం కావాలనిి, కార్మికుల సమస్యల పరిష్కారం కావాలి, నిరుద్యోగ సమస్య పరిష్కారం కావాలని ఆలోచన ఉండదు. సిపిఎం మండల కార్యదర్శి ఎడవల్లి రమణారడ్డి అధ్యక్షతన జరిగిన ఈ బహిరంగ సభలో సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి నాగేశ్వరరావు, సిపిఎం నియోజకవర్గ కన్వీనర్ బండి రమేష్, బుగ్గ వీటి సరళ, సిపిఎం మండల కార్యవర్గ సభ్యులు శీలం గురుమూర్తి, మండల కార్యవర్గ సభ్యులు మల్లెల సన్మత్ రావు, తోట కూర రాజు, సభ్యులు చీర్ల రాధాకృష్ణ, గ్రామ సర్పంచ్ పొట్ట పింజర నాగేశ్వరరావు పాల్గొన్నారు.