Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆచరించడమే నిజమైన నివాళి
- సదస్సు, సహాపంక్తి భోజనాల కార్యక్రమంలో నబీ
నవతెలంగాణ-ఇల్లందు
మనం నేర్చుకోవల్సిన అద్బుత లక్షణాలున్న ఆదర్శమూర్తి సుందరయ్య అని ప్రతీ సభ్యుడు, కార్యకర్త నాయకులు ఆచరించడమే ఆయనకు మనం ఇచ్చే నిజమైన నివాళి అని సీపీఐ(ఎం) జిల్లా కమిటీ సభ్యులు నబీ అన్నారు. గురువారం సీపీఐ(ఎం), సీఐటీయూ మండల కమిటీ ఆధ్వర్యంలో పట్టణంలోని వినోబాభావే కాలనీలో సదస్సు, సహపంక్తి భోజనాల కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అధ్యక్షులుగా మరియ వ్యవహారించారు. అనంతరం ''విప్లవ పథంలో నా పయనం'' సుందరయ్య జీవిత చరిత్రను సీపీఐ(ఎం) సీనియర్ నాయకులు దేవులపల్లి యాకయ్య, ''నా మాటే తుపాకీ తూట ''మల్లు స్వరాజ్యం జీవిత చరిత్రను పార్టీ మండల కమిటీ సభ్యులు వజ్జ సురేష్ కర్తవ్యలపై పార్టీ మండల కార్యదర్శి అబ్దుల్ నబి వివరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. అనంతరం సహాపంక్తి భోజనాలు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో తాళ్లూరి కృష్ణ, ఆలేటి కిరణ్, మన్నెం మోహన్ రావు, వెంకటమ్మ, శంకర్, ఆలేటి, సంధ్య, జైబ్యున్నిసా, ఖాదర్, వెంకటేశ్వర్లు, అబ్బాస్, తదితరులు పాల్గొన్నారు.