Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీఎల్పీ లీడర్ మల్లు భట్టి విక్రమార్క
నవతెలంగాణ-ఎర్రుపాలెం
ఎన్నికల హామీలను నెరవేర్చని ప్రభుత్వం గద్దె దిగాలని సీఎల్పీ లీడర్ మల్లు బట్టి విక్రమార్క ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు, మండల కేంద్రమైన ఎర్రుపాలెంలో తొలుత దేవరకొండ నాగభూషణం కుమార్తె వివాహానికి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఎర్రుపాలెంలో జరిగిన విలేకరుల సమావేశంలో గురువారం ఆయన మాట్లాడుతూ నిరుద్యోగ భృతి ఇస్తానన్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒకే కుటుంబానికి సంపద దోచిపెడుతుందని, కొట్లాడి తెచ్చుకున్న తెలం గాణలో రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమాన్ని పక్కదారి పట్టించి ప్రజలను గాలికి వదిలేసిందని ఆయన ప్రభుత్వంపై మండిపడ్డారు. అకాల వర్షానికి తడిసిన వడ్లను ప్రభుత్వమే కొనుగోలు చేయాలని ,నీళ్లు, నిధులు, నియామకాల కోసం కోట్లాది తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో ఆకలి చావులు ఎందుకు జరుగుతున్నాయని ఆయన ప్రభుత్వాన్ని నిలదీశారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు పువ్వాల్లా దుర్గాప్రసాద్, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వేమిరెడ్డి సుధాకర్‌రెడ్డి, బండారు నరసింహారావు, శ్రీనివాస్ రెడ్డి, నర్సిరెడ్డి, కడియం శ్రీనివాసరావు, షేక్ జాని భాష, కంచర్ల వెంకట నరసయ్య తదితరులు పాల్గొన్నారు.