Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కార్మికులను దోచుకునే రోడ్డు సేఫ్టీ బిల్లును రద్దు చేయాలి
- ఆటో కార్మిక సంఘాల జాయింట్ యాక్షన్ కమిటీ నేతలు
- ఆటోలతో జిల్లా కేంద్రంలో భారీ ప్రదర్శన-ధర్నా
నవతెలంగాణ-కొత్తగూడెం
జరిమానాల పేరుతో కేంద్రం ప్రభుత్వం రవాణా రంగ కార్మికులను దోచుకుంటూ ఖజానాను నింపుకుంటోందని, స్వయం ఉపాధితో బతకు సాగిస్తున్న రవాణారంగ కార్మికులను దోచుకుంటామంటే చూస్తూ ఊరుకోబోమని, ఉద్యమాలతోనే కేంద్ర చర్యలను తిప్పికొడతామని ఆటో కార్మిక సంఘాల జేఏసీ నేతలు హెచ్చరించారు. వాహనాల ఫిట్నెస్ రెన్యూవల్స్‌కు రోజుకు రూ.50ల అపరాధ రుసుము విధించడాన్ని నిరసిస్తూ, రోడ్ సేఫ్టీ బిల్లు 2019ని రద్దుచేయాలని, పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలను తగ్గించాలని తదితర 18 డిమాండ్ల పరిష్కారం కోసం రాష్ట్ర జేఏసీ పిలుపులో భాగంగా గురువారం చేపట్టిన రవాణా బంద్ కొత్తగూడెం డివిజన్లో జయవంతమైంది. ఆటో, లారీ, డీసీఎం, టాటా ఏస్, జీప్ తదతర ప్రజా, వస్తు రవాణా రంగ కార్మికులు స్వచ్ఛందంగా బంద్‌లో పాల్గొన్నారు. బంద్ సందర్భంగా బస్టాండ్ సెంటర్ అమరవీరుల స్థూపం నుండి కలెక్టరేట్ వరకు భారీ ప్రదర్శన నిర్వహించిన అనంతరం కలెక్టరేట్ ఎదుట ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా జరిగిన సభలో జేఏసి నాయకులు మాట్లాడుతూ గతంలో ఉన్న జరిమాణాలలో నాలుగు రెట్లు పెంచి వాహ నదారులకు కేంద్రం నరకం చూపెడుతోందని, విదేశాల్లో అమలవుతున్న రోడ్డు సేఫ్టీ బిల్లును దిగుమతి చేసుకొని దేశ, రాష్ట్ర ప్రజలపై రద్దుతున్నారని విమర్శించారు. సరైన సౌకర్యాలు, సమాజంలో విద్యాస్థాయి, నిరుద్యోగ సమస్యను దృష్టిలో ఉంచుకొని రోడ్డు సేఫ్టీ బిల్లును రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ ధర్నా సభలో ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి గుత్తుల సత్యనారాయణ, కార్యదర్శి కంచర్ల జమలయ్య, సీఐటీయూ జిల్లా అధ్యక్షులు ఎంవి.అప్పారావు, పట్టణ కన్వీనర్ డి.వీరన్న, ఇఫ్ట్యూ జిల్లా నాయకులు పి.సతీష్, మల్లిఖార్జున్, ఐఎన్టీయుసీ జిల్లా నాయకులు కాలం నాగభూషణం, నాగరాజు మాట్లాడారు. ధర్నాలో ఏఐటియుసి నాయకులు గెద్దాడ నగేష్, నేరెళ్ళ శ్రీనివాస్, బత్తుల సత్యనారాయణ, జోసఫ్, కృష్ణ, అబ్బులు, లక్ష్మణ్, వీర్ల దుర్గ, విజ్జి, కోడూరి శ్రీను, శ్యామ్, సీఐటీయూ నాయకులు భూక్య రమేష్, లిక్కి బాలరాజు, వెంకటయ్య, ఐఎన్టీయుసి నాయకులు నాగరాజు, మంద శ్రీను తదితరులు పాల్గొన్నారు.
చర్ల సీఐటీయూ మండల కమిటీ ఆధ్వర్యంలో ఆటో కార్మికులు బస్టాండ్ సెంటర్ నుండి తహసీల్దార్ కార్యాలయం వరకు ప్రదర్శన నిర్వహించి తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐటీయూ ఆటో యూనియన్ మండల అధ్యక్షులు పి.బాలాజీ అధ్యక్షతన జరిగిన సభలో జిల్లా ఉపాధ్యక్షులు బ్రహ్మచారి మాట్లాడారు. ప్రభుత్వం ప్రైవేటు ట్రాన్స్పోర్ట్ కార్మికులపై కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన మోటార్ వెహికల్ చట్టం 2019 వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో సీఐటీయూ మండల నాయకులు శ్యామల వెంకటేశ్వర్లు, ఆటో యూనియన్ నాయకులు సంపత్, అజరు కుమార్, సతీస,్ వినరు, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.