Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ(ఎం) జిల్లా కమిటీ సభ్యులు సత్యనారాయణ
నవతెలంగాణ-పాల్వంచ టౌన్
పాల్వంచ మండలంలో బండ్రు గొండ గ్రామపంచాయతీ పరిధిలో కోయ గట్టు గిరిజనుల ప్రజలకు తాగునీరు అందించాలని సీపీఐ (ఎం) జిల్లా కమిటీ సభ్యులు అన్నవరం సత్యనారాయణ డిమాండ్ చేశారు. గురువారం కొండగట్టు గ్రామాన్ని సందర్శించిన ఆయన గ్రామంలోని గిరిజన ప్రజలు తాగునీరు లేక కిలోమీటర్ల దూరం వెళ్లి తాగునీరును బిందెల ద్వారా తెచ్చుకోవాల్సిన దుస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు.
గ్రామంలో ఉన్న ఒక బోరు చెడిపోయి సుమారు 20 రోజులు అవుతున్నప్పటికీ సర్పంచ్, కార్యదర్శి పట్టించుకోవడం లేదని ఆరోపించారు. ఉన్నతాధికారులు వెంటనే స్పందించి, బోర్ మరమ్మతులు చేయించి గిరిజన ప్రజలకు వేసవికాలంలో దాహర్తిని తీర్చాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) మండల కార్యదర్శి వెంకటేశ్వర్లు, గ్రామస్తులు పాల్గొన్నారు.