Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి బి.మధు
- ఆటో ట్రాన్స్పోర్ట్ కార్మికుల బంద్ విజయవంతం
నవతెలంగాణ - ఖమ్మం
కేంద్ర ప్రభుత్వం పెంచిన ఫిట్నెస్ చార్జీలు, కేంద్ర ప్రభుత్వం తెచ్చిన 714 జీవోను రద్దు చేయాలని సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి బి. మధు డిమాండ్ చేశారు. గురువారం ఖమ్మంలోని ఆటో ట్రాన్స్పోర్ట్ కార్మికులు జిల్లా బంద్ విజయవంతం అయింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం కార్పొరేట్ శక్తులకు వత్తాసు పలుకుతూ చిన్నచిన్న ఆటోమొబైల్స్ మెకానిక్ షెడ్లు మూసివేసిన పరిస్థితి వస్తుందని అని తెలిపారు. ఇక మీద ఈ చట్టంలో అందరూ షోరూంలలో రిపేర్ చేయించుకోవాలని ఈ చట్టాన్ని తీసుకొచ్చారని కానీ చిన్నచిన్న కార్మికులు ఆటో మొబైల్స్ మెకానిక్ షెడ్లు మూత పడే అవకాశం ఉందన్నారు. అదే షో రూమ్‌లోకి వెళితే వేల రూపాయలు ఖర్చు అవుతుందని కార్మికులు, డ్రైవర్లు ఆందోళన చెందుతున్నారన్నారు. ఈ 2019 చట్టం అలాగే ఈ చట్టంలో తీసుకొచ్చిన జీవోలను రద్దు చేయాలన్నారు. భవిష్యత్తులో ఈ చట్టాన్ని రద్దు చేయకపోతే పెద్ద ఎత్తున ఆందోళన ఈ చట్టం రద్దు వరకు పోరాడుతామని ట్రాన్స్పోర్ట్ నాయకత్వం తెలియజేశారు. అనంతరం ఆటో మోటార్ ట్రాన్స్పోర్ట్ జేఏసి ఆధ్వర్యంలో ఖమ్మంలో పలు కూడళ్లలో ర్యాలీ, రవాణా శాఖ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించి ఎంవీఐ వర ప్రసాద్‌కి వినతి పత్రం అందజేశారు. కార్యక్రమంలో ఆటో యూనియన్ జేఏసీ నాయకులు, సిఐటియూ జిల్లా ప్రధాన కార్యదర్శి కల్యాణ వెంకటేశ్వరరావు, జిల్లా అధ్యక్షులు విష్ణువర్ధన్, ఐఎఫ్టియు జిల్లా అధ్యక్షులు శ్రీనివాస్, ఐఎఫ్టియు జిల్లా ఆటో యూనియన్ జిల్లా అధ్యక్షుడు లక్ష్మీనారాయణ, ఏఐఆర్టి డబ్ల్యూ ఎఫ్ (సిఐటియూ) రాష్ట్ర ఉపాధ్యక్షుడు జిల్లా ఉపేందర్, టిఆర్ఎస్ కెవి టిఏటియు జిల్లా అధ్యక్షుడు పాల్వంచ కృష్ణ, సిఐటియూ నాయకులు బొట్ల విద్యాసాగర్, ఎఐటియుసి నాయకులు పేరబోయిన మోహన్ రావు, రావుల శ్రీనివాస్, నాయకులు టిఎస్డిఏ జిల్లా అధ్యక్షులు పెరుగు బిక్షం, కమలాకర్ రెడ్డి, వేమ సెల్వ రాజు, శ్రీను, జానీ, సాగర్, లక్ష్మీనారాయణ, సలీం పాల్గొన్నారు.