Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సంస్మరణ సభలో సీపీఐ మాజీ జాతీయ నాయకలు పువ్వాడ
- సుశీలమ్మ చిత్ర పటం వద్ద నివాళులు అర్పించిన ఎమ్మెల్యే పొదెం
- వివిధ పార్టీలకు చెందిన ముఖ్య నేతలు, మాజీ ఎంపి మిడియం
నవతెలంగాణ-దుమ్ముగూడెం
ఈ ప్రాంత ఉద్యమ నిర్మాతల్లో ఒకరైన అమరజీవి రావులపల్లి నాగభూషణం సతీమణి, నర్సాపురం గ్రామపంచాయతీ సర్పంచ్‌గా పని చేసి, భర్త అడుగుజాడల్లో నడుస్తూ ప్రజా ఉద్యమాలకు ఇద్దరు వారసులను అందించిన అమరజీవి రావులపల్లి సుశీలమ్మ ధన్యజీవి అని సీపీఐ మాజీ జాతీయ నాయకులు పువ్వాడ నాగేశ్వరరావు అన్నారు. గురువారం నర్సాపురం గ్రామంలో జరిగిన సుశీలమ్మ సంస్మరణ కార్యక్రమంలో ఆయన పాల్గొని ఆమె చిత్ర పటానికి పూల మాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఆయనతో పాటు భద్రాచలం ఎమ్మెల్యే పొదెం వీరయ్య, మాజీ పార్లమెంట్ సభ్యులు మిడియం బాబురావు, మాజీ డీసీసీబీ అద్యక్షులు యలమంచి రవికుమార్, సిపిఐ(ఎం) మండల కార్యదర్శి కారం పుల్లయ్యతో పాటు ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలకు చెందిన సిపిఐ జిల్లా కార్యదర్శులు పోటు ప్రసాద్, సాబీర్ పాషా, రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు బాగం హేమంతరావు, బొల్లోజు అయోద్య,లతో పాటు టిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి తెల్లం వెంకట్రావు, పినపాక మాజీ శాసన సభ్యులు పాయం వెంకటేశ్వర్లు, డిసిసిబి డైరెక్టర్ తుళ్లూరు బ్రహ్మయ్య, దుమ్ముగూడెం, భద్రాచలం మండల అద్యక్షులు అన్నె సత్యనారాయణ మూర్తి తదితరుల తరలి వచ్చి సుశీలమ్మ చిత్ర పటం వద్ద నివాళులు అర్పించి, ఆమె కుమారులు రావులపల్లి పోదరులు రాంప్రసాద్, రవికుమార్‌ల సానుభూతి తెలియజేశారు.