Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వారి ఉద్యమ స్పూర్తితో వర్గ పోరాటాలను ఉధృతం చేయాలి
- సుందరయ్య, సీతారామయ్యల వర్ధంతి సభలో బాబురావు
నవతెలంగాణ-దుమ్ముగూడెం
నిక్కాసైన మార్క్సిస్ట్ ఉద్యమ నేతలుగా బలమైన వర్గ పోరాటాలు నడిపి సీపీఐ(ఎం) బావజాలాను ప్రజల్లోకి తీసుకు వెళ్లిన మహోన్నత ఉద్యమ నేతలు అమరజీవులు కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య (పిఎస్), యలమంచి సీతారామ య్యలు (వైఎస్)లు అని భద్రాచలం మాజీ పార్లమెంట్ సభ్యులు, సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు డాక్టర్ మిడియం బాబురావు అన్నారు. వారి ఉద్యమ స్పూర్తితో భద్రాచలం డివిజన్లో పార్టీకి గత వైభవం తీసుకువచ్చేందుకు బలమైన ప్రజా పోరాటాలకు పార్టీ శ్రేణులు సిద్దం కావాలని ఆయన పిలుపునిచ్చారు. గురువారం అమరజీవులు కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య, 37వ వర్దంతి, యలమంచి సీతారామయ్యల 15 వర్దంతి వేడుకలను లకీëనగరం స్టేట్ బ్యాంకు ఎదురుగా ఉన్న యలమంచి సీతారామయ్య స్థూపం వద్ద ఘనంగా నిర్వహించారు. ముందుగా పార్టీ జెండాను మిడియం బాబురావు ఎగురవేశారు. అనంతరం నాయకులు సుందరయ్య, సీతారామయ్య చిప్రపటాలతో పాటు అమరజీవి గుడ్ల శివరావుల చిత్రపటాలకు పూల మాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. మండల కార్యదర్శి కారం పుల్లయ్య అధ్యక్షతన జరిగిన వర్దంతి సభలో మిడియం మాట్లాడారు. కేంద్ర బీజేపీ ప్రభుత్వం ప్రైవేటీకరణ ప్రోత్సహి స్తుంటే ప్రతి పక్ష పార్టీ అని చెప్పుకుంటున్న కాంగ్రెస్ పార్టీ సైతం తాము అదే తాను ముక్కలం అన్న చందంగా ప్రైవేటీకరణతో దేశాన్ని అభివృద్ది పధంలో నడిపిస్తామచి చెబుతోందన్నారు. దేశంలో నేడు ప్రత్మామ్నాయం కమ్యూనిస్టులు మాత్రమేనని ఆయన అన్నారు. 1946 నుండి 1951 వరకు సాగిన వీరతెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో పుచ్చలపల్లి సుందరయ్య కీలక భూమిక పోషించారని ఆయన అన్నారు. సుందరయ్య, సీతారామయ్యలు బడుగు బలహీన వర్గాల ప్రజల కోసం, కూలీ పోరాటాలు, ప్రజా ఉద్యమాలు నిర్వహించారన్నారు. సీతారామయ్య భద్రాచలం డివిజన్ ఉద్యమ నిర్మాతల్లో ఒకరిగా ఈ ప్రాంతంలో చెరగని ముద్రవేసుకున్న మహౌన్నత నాయకుడన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు, మాజీ డీసీసీబీ చైర్మన్ యలమంచి రవికుమార్, జిల్లా కమిటీ సభ్యులు సరియం కోటేశ్వరరావు, మర్మం చంద్రయ్య, యల మంచి వంశీకృష్ణ, బొల్లి సూర్యచందర్రావు, యల మంచి శ్రీనివాసరావు, సోయం వీర్రాజు, వాగె ఖాదర్బాబు, సోడి రాంబాబు, సాయిరెడ్డి, యండి బేగ్, కల్లూరి దేవి, గుడ్ల రామ్మోహన్రెడ్డి, కుమ్మరి కుంట్ల సాంబశివరావు, తెల్లం ధర్మయ్య, బొల్లి సత్యనారాయణ, పెనుబల్లి ప్రసాద్, మహమద్ హుస్సేన్, సతీష్ తదితరులు పాల్గొన్నారు.