Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రాష్ట్ర స్థాయి అవార్డు అందుకున్న డీఆర్డీఓ
- అందజేసిన మంత్రి యర్రబల్లి దయాకర్రావు
నవతెలంగాణ-కొత్తగూడెం
రాష్ట్ర వ్యాప్తంగా స్వయం సహాయక సంఘాలకు రుణాలు అందచేయడంలో ముందున్న భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు రాష్ట్ర స్థాయి అవార్డు లభించింది. బుధవారం హైద్రాబాద్లో జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు చేతుల మీదుగా జిల్లా గ్రామీణాభివృద్ధి (డిఆర్డీఓ) పీడి మధుసూదన్ రాజు అవార్డు అందుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ అనుదీప్ రుణాలు మంజూరులో జిల్లాను ముందంజలో నిలిపిన డీఆర్డీఓ మధుసూదన్ రాజును, సిబ్బందిని ప్రత్యేకంగా అభినందించారు. మారుమూల ప్రాంతమైన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మహిళలు ఆర్థికాభివృద్ధి సాధనకు స్వయం సహాయక రుణాలు ఎంతో దోహదపడతాయని చెప్పారు. సకాలంలో రుణాలు మంజూరుకు చర్యలు చేపడుతున్న డీఆర్డీఓ, సిబ్బందిని, బ్యాంకర్లును ఆయన అభినందించారు. ఇదే స్ఫూర్తితో ముందుకు పోదామని ఉన్నత ప్రమాణాలు సాధనకు రుణాలు ఉపయోగ పడుతాయని ఆయన స్పష్టం చేశారు.