Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జీఓ 76 ఇండ్ల స్థలాల క్రమబద్దీకణ పట్టాల పంపిణీ
- ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు
నవతెలంగాణ-కొత్తగూడెం
ప్రజలే నా దేవుళ్ళని, ప్రజాసేవకే నా జీవితం అంకితమని, చివరి శ్వాస వరకు ప్రజకు సేవచేయడం కోసమేనని కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరావు అన్నారు. గురవారం కొత్తగూడెం పట్టణంలో జిఓ 76 ద్వాదా అర్హులైన లబ్ది దారులకు ఇండ్ల స్థలాల పట్టాలు పంపిణీ చేశారు. స్థానిక కొత్తగూడెం క్లబ్లో జరిగిన కార్యక్రమంలో అర్హులైన లబ్ధిదారులకు క్రమబద్ధీకరణ పట్టాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఎన్నికల ముందు మున్సిపల్ పరిధిలోని ప్రజలకు ఇచ్చిన హామీల మేరకు జిఓ 76 ఇండ్ల స్థలాల క్రమబద్ధీకరణ పట్టాలను పంపిణీ చేస్తున్నామని తెలిపారు. ఇచ్చిన వాగ్దానం ప్రకారం పట్టాలు పంపిణీ చేయడంతో నా జన్మ ధన్యమైందని, కొత్తగూడెం నియోజకవర్గ ప్రజలకు ఏ కష్టం వచ్చినా అండగా ఉంటానని, నా తుది శ్వాస వరకు ప్రజా క్షేత్రంలోనే ఉంటానని ఉద్ఘాటించారు. సకాలంలో ఇండ్ల పట్టాలు ప్రజలకు అందజేసిన తహసీల్దార్ రామకృష్ణను ఈ సందర్భంగా ఎమ్మెల్యే వనమా సన్మానించారు. ఈ కార్యక్రమంలో జిల్లా జడ్పీ వైస్ చైర్మన్ కంచర్ల చంద్రశేఖర్ రావు, మున్సిపల్ చైర్ పర్సన్ కాపు సీతా లక్ష్మి, మున్సిపల్ వైస్ చైర్మన్ దామోదర్ యాదవ్, తహసీల్దార్ రామకృష్ణ, ఆత్మ కమిటీ చైర్మన్ బత్తుల వీరయ్య, ఉర్దూ ఘర్ కమిటీ చైర్మన్ అన్వర్ పాషా, మున్సిపల్ వార్డు కౌన్సిలర్లు, కో-ఆప్షన్ సభ్యులు పాల్గొన్నారు.