Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-అశ్వారావుపేట
భారత కమ్యూనిస్టు పార్టీ(మార్క్సిస్టు) వ్యవస్థాపకుల్లో ముఖ్యులైన కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య వ్యక్తిత్వం పార్టీ శ్రేణులకు స్ఫూర్తి దాయకం అని పార్టీ జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు కొక్కెరపాటి పుల్లయ్య అన్నారు. ఆయన 37 వర్ధంతిని గురువారం మండలంలో పలు పార్టీ అనుబంధ సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించారు. పార్టీ కార్యాలయంలో సీఐటీయూ అనుబంధ హమాలి కార్మిక సంఘం ఆద్వర్యంలో పిట్టల అర్జున్ అద్యక్షతన సుందరయ్య చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం నందిపాడు గ్రామ శాఖల ఆధ్వర్యంలో నిర్వహించారు. ఇక్కడ మాడి నాగేశ్వరరావు అధ్యక్షతన స్థానిక సర్పంచ్ ఊకే వీరాస్వామి పార్టీ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పుల్లయ్య మాట్లాడారు. ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ బి.చిరంజీవి, మండల కమిటీ సభ్యులు మడిపల్లి వెంకటేశ్వరావు, శాఖా కార్యదర్శులు పాల్గొన్నారు.
అన్నపురెడిపల్లి : పుచ్చలపల్లి సుందరయ్య వర్ధంతి సందర్భంగా జిల్లా సీపీఐ(ఎం) కమిటీ సభ్యులు కొండపల్లి శ్రీధర్ జానికిపురం గ్రామంలో పతాకా విష్కరణ చేసి ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా శ్రీదర్ మాట్లాడారు. ఈ కార్యక్రమంలో మండల కార్యదర్శి జంగిలు వెంకటరత్నం, కోటయ్య, వెంకన్న, ఏకలక్ష్మి, సామ్రాజ్యం ,,పుల్లమ్మ తదితరులు పాల్గొన్నారు.
చండ్రుగొండ : సీపీఐ(ఎం) జిల్లా కమిటీ సభ్యులు కొండపల్లి శ్రీధర్ ఆధ్వర్యంలో పార్టీ కార్యాలయంలో సుందరయ్య వర్ధంతి ఘనంగా నిర్వహించారు. ఆయన చిత్రపటానికి కార్యకర్తలు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా శ్రీధర్ మాట్లాడారు. మండల కార్యదర్శి రామ్ రెడ్డి, మండల కమిటీ సభ్యులు విప్పర్ల పెద్ద వెంకటేశ్వర్లు, రామారావు, తిరుమల రావు, వేణు, రారు రాజా, వెంకటాచారి, సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
ఇల్లందు : సీపీఐ(ఎం), సీఐటీయూ మండల కమిటీ ఆధ్వర్యంలో కొత్త బస్టాండ్ సెంటర్లో సుందరయ్య స్తూపం వద్ద జెండావిష్కరణ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) జిల్లా కమిటీ సభ్యులు అబ్దుల్, సీనియర్ నాయకులు దేవులపల్లి యాకయ్య, నాయకులు ఆలేటి కిరణ్, కృష్ణ, మోహన్ రావు, వెంకటమ్మ, శంకర్, సంధ్య, తదితరులు పాల్గొన్నారు.
మణుగూరు : సీపీఐ(ఎం) మండల కార్యదర్శి వర్గ సభ్యులు టీవీ ఎం.వి.ప్రసాద్ నాయకత్వంలో సుందరయ్య వర్ధంతి సందర్భంగా జెండా ఆవిష్కరించారు. అనంతరం చిత్రపటానికి పూలమాలవేసి, నివాళులు అర్పించారు. సమావేశంలో ప్రసాద్ సుందరయ్య జీవిత చరిత్ర వివరించారు. ఈ కార్యక్రమంలో నందం ఈశ్వర్ రావు, వై.నాగలక్ష్మి, ఉత్తం, తోట పద్మ, గౌరీ, సైదులు, శ్రీను, రాజేష్ తదితరులు పాల్గొన్నారు.
జూలూరుపాడు : మండలంలోని స్థానిక సీపీఐ(ఎం) కార్యాలయం నందు సుందరయ్య వర్ధంతి సందర్భంగా వల్లమల్ల చందర్రావు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ఆయన చిత్రపటానికి మండల కమిటీ సభ్యులు గార్లపాటి వెంకట్ పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం మండల కార్యదర్శి యాస నరేష్ జెండా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నరేష్ మాట్లాడారు. ఈ కార్యక్రమంలో మండల కమిటీ సభ్యులు గడిచేసి కనకరత్నం, బానోతు మధు, నాయ కులు లెనిన్, నరేష్, కృష్ణ, నవీన్, కార్తీక్, ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు పవన్‌కుమార్ పాల్గొన్నారు.
దమ్మపేట : సీపీఐ(ఎం) మండల కమిటీ ఆధ్వర్యంలో సుందరయ్య వర్ధంతి ఘనంగా నిర్వహించారు. ఈ వర్ధంతి సభకు పెనుబల్లి నాన రావు అధ్యక్షత వహించగా సుందరయ్య చిత్రపటానికి ఎండ అప్పారావు పూలమాలలు వేసి ఘన నివాళి అర్పించారు. ఈ సందర్భంగా మండల కార్యదర్శి మోరంపూడి శ్రీనివాసరావు మాట్లాడరు. ఈ కార్యక్రమంలో మోరంపూడి కేశవరావు, చేను బోయిని బ్రహ్మయ్య, కోరం గోపరాజు, వెంకటేష్, నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
ములకలపల్లి : పుచ్చలపల్లి సుందరయ్య జీవితం నేటియువతకు స్ఫూర్తిదాయకమని సీపీఐ(ఎం) మండల కార్యదర్శి ముదిగొండ రాంబాబు అన్నారు. గురువారం పుచ్చలపల్లి సుందరయ్య వర్ధంతిని మండల కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించారు. తొలుత ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు వెంకటేశ్వర్లు, వి.రవికుమార్, నిమ్మల మధు, గడ్డం వెంకటేశ్వర్లు, రావుజా, తిరుపతమ్మ, జగ్గు తదితరులు పాల్గొన్నారు.
పినపాక : పినపాక మండలం సీతంపేట గ్రామం ఎస్సీ కాలనీలో పుచ్చలపల్లి సుందరయ్య జయంతి సందర్భంగా పార్టీ ఆధ్వర్యంలో జెండా ఆవిష్కరణ చేసి సుందరయ్య కు నివాళులర్పించారు. కొద్దిసేపు మౌనం పాటించారు. ఈ కార్యక్రమంలో గుడారపు వెంకన్న, పూసా నరసింహారావు, శ్రీను, అబ్బురం, గద్దల వెంకటేశ్వరరావు, తదితరులు పాల్గొన్నారు.
అశ్వాపురం : మండల పరిధిలోని మల్లెల మడుగు గ్రామంలో సుందరయ్య వర్ధంతి ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు మచ్చా వెంకటేశ్వర్లు మాట్లాడుతూ భూమి కోసం భుక్తి కోసం నేలతల్లి విముక్తి కోసం పోరాడిన మహా యోధుడు భరతమాత ముద్దుబిడ్డ సుందరయ్య అని కొనియాడారు. తొలుత సుందరయ్య చిత్రపటానికి పార్టీ సీనియర్ నాయకులు స్వర్గం బాల నర్సయ్య పూలమాలవేసి ఘనంగా ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమానికి మల్లెల మడుగు సీపీఐ(ఎం) శాఖ కార్యదర్శి దండి రాములు అధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమంలో మండల కార్యదర్శి పాయం నరసింహారావు, బీరం శ్రీనివాస్, పి,.అశోక్ రెడ్డి, పి.సుధాకర్ రెడ్డి, రైతు సంఘం నాయకులు బద్దం శేంబిరెడ్డి, మండల ఐద్వా కార్యదర్శి కొప్పుల పద్మ, ఆవుల సుధాకర్, వెంకన్న, బొడ్డు రాములు తదితరులు పాల్గొన్నారు.