Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కొత్తగూడెం
సింగరేణిలో గత 20 ఏండ్ల నుండి కాలనీ ఏరియాలలో పారిశుధ్య పనులు చేస్తున్న కాంట్రాక్టు కార్మికుల పనులను సింగరేణి యాజమాన్యం స్థానిక మున్సిపాలిటీలకు, గ్రామ పంచాయతీలకు అప్పగించాలనే యాజమాన్యం ఆలోచనలను తక్షణమే విరమించుకోవాలని సింగరేణి కాంట్రాక్ట్ కార్మికుల సంఘం సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు యార్రగాని కృష్ణయ్య డిమాండ్ చేశారు. గురువారం కార్పొరేట్లోని వివిధ పని ప్రదేశాల్లో జరిగిన కార్మికుల గ్రూప్ మీటింగ్లో పాల్గొని ఆయన పాల్గొని మాట్లాడారు. గత రెండు రోజుల క్రితం కొత్తగూడెంలో జరిగిన సింగరేణి, స్థానిక సంస్థల అధికారుల సమీక్ష సమావేశంలో సివిల్ జనరల్ మేనేజర్ సింగరేణి కాంట్రాక్టు కార్మికుల గురించి చులకనగా మాట్లాడడం చాలా దుర్మార్గం అని విమర్శించారు. ఇప్పటికైన సింగరేణి ఉన్నతాధికారులు జోక్యం చేసుకొని పారిశుద్ధ్య పనులను స్థానిక మున్సిపాలిటీలకు, గ్రామ పంచాయతీలకు అప్పగించే ఆలోచనను తక్షణమే విరమించుకోవాలని, లేనియెడల జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు సంజీవరావు, రమణ, బాలాజీ, లక్ష్మి, మల్లేశ్వరి, వెంకటస్వామి, వినోద్ తదితరులు పాల్గొన్నారు.