Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-దమ్మపేట
ముస్లింలకు 4 శాతం రిజర్వేషన్లను వెనక్కి తీసుకోవాలని కేంద్ర మంత్రి అమిత్షా వ్యాఖ్యానించడం సరికాదని వైఎస్ఆర్టీపీ జిల్లా అధికార ప్రతినిధి పెనుబల్లి రమేష్ బాబు అన్నారు. గురువారం వారి ఆధ్వర్యంలో మండలంలో బీజేపీ దిష్టి బొమ్మను దహనం చేశారవు. ఈ కార్యక్రమంనకు ముఖ్య అతిథిగా జిల్లా అధ్యక్షుడు నరాల సత్యనారాయణ హాజరై ప్రసంగించారు. భారత దేశాన్ని భిన్నత్వంలో ఏకత్వం అంటాము. భిన్నత్వంలో ఏకత్వం ఉన్న మన దేశాన్ని కులం పిచ్చి, మతం పిచ్చితో వేరు చేయడాన్ని చూస్తుంటే, అమిత్ షా మతకల్లోలాలు రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యానించినట్టు ఉందన్నారు. తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని, లేని పక్షంలో జిల్లాతో పాటు మొత్తం ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా మహిళా ఇంఛార్జి జన్ భి, యువజన విభాగం ఉపాధ్యక్షులు షేక్ ఫిరోజ్, మండల ప్రధాన కార్యదర్శి శ్రీరాముల వెంకటేశ్వరరావు, మండల యువజన విభాగం అధ్యక్షుడు శ్రీను, మండల నాయకులు పాకనాటి శ్రీను, వెంకటేష్, శ్రీకాంత్, గణేశ్ తదితరులు పాల్గొన్నారు.