Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బిందెలతో గిరిజన మహిళలు ధర్నా
నవతెలంగాణ-కొత్తగూడెం
వేసవి వచ్చిందంటే నీటి సమస్య తీవ్రంగా ఉంటుంది. కారణంగా మహిళలు ఇబ్బందులకు గురవుతుంటారు. మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికీ తాగునీరు అందిస్తామని ప్రభుత్వం చెప్పినప్పటికీ నీటి ఎద్దడి తీవ్రంగా కనిపిస్తుంది. లక్ష్మీదేవి పల్లి మండలం, రేగళ్ళ తండా గ్రామంలో తాగునీటి నీటి ఎద్దడి తీవ్రంగా ఉంది. ఆదివారం ఖాళీ బిందెలతో మహిళలు గ్రామంలోని రోడ్డు మీద ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మిషన్ భగీరథ పైప్ లైన్లు వేసినప్పటికీ తాగేందుకు నీళ్లు రావడం లేదని మండిపడ్డారు. అధికారులు స్పందించి ప్రజల దాహార్తిని తీర్చాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించారు.