Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సత్తుపల్లి శాసనసభ్యులు సండ్ర వెంకటవీరయ్య
- సారయ్య దంపతుల చిత్రపటాలకు నివాళులు
సత్తుపల్లి : కల్లూరు ఆర్డబ్ల్యూఎస్ ఏఈ తాడూరి సారయ్య, ఆయన సతీమణి సుజాత వరంగల్ హంటర్ రోడ్డులోని బ్రిడ్జి పైనుంచి కారు పడిపోయి మరణించడం బాధాకరమని స్థానిక ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య ఆవేదన వ్యక్తం చేశారు. స్థానిక క్యాంపు కార్యాలయంలో సారయ్య దంపతులకు సంతాపసభను నిర్వహించారు. వారి చిత్రపటాలకు పూలమాలలేసి నివాళులర్పించారు. పెండ్లిరోజునే భార్యాభర్తలు మరణించడం అత్యంత విచారకరమన్నారు. వారి ఆత్మలకు వాంతి చేకూరాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో ఆత్మ ఛైర్మెన్ శీలపురెడ్డి హరికృష్ణారెడ్డి, టీఆర్ఎస్ పట్టణ ప్రధాన కార్యదర్శి మల్లూరు అంకమరాజు, కౌన్సిలర్లు మట్టా ప్రసాద్, ఎస్కే చాంద్‌పాషా, అద్దంకి అనిల్‌కుమార్, గుంట్రు రాఘవేంద్ర, నాయకులు నడ్డి ఆనందరావు, మేకల నరసింహారావు, కంభంపాటి మల్లికార్జునరావు, మిద్దే శ్రీనివాసరావు పాల్గొన్నారు.