Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- హాజరైన జడ్పీ, మున్సిపల్ చైర్మన్లు
నవతెలంగాణ-కారేపల్లి
కారేపల్లి మండలం తొడితలగూడెంలో ప్రాచీన ప్రాశస్త్వం గల శ్రీలక్ష్మినర్సింహస్వామి ఆలయంలో ఆదివారం దేవేరులకు అత్యంత వైభవంగా కల్యాణమహౌత్సవాన్ని నిర్వహించారు. స్వామి వారి ప్రాణి గ్రహణ సందర్బంగా వేద పండితులు బ్రహ్మౌత్సవాలకు అంకురార్పణ కావించారు. స్వామి కల్యాణంను కనువిందుగా సాగింది. ఈకళ్యాణమహౌత్సవానికి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పరిషత్ చైర్మన్ కోరం కనకయ్య, ఇల్లందు మున్సిపల్ చైర్మన్ దమ్మాలపాటి వెంకటేశ్వర్లు(డీవీ)లు హాజరైనారు. వీరిచే అర్చకులు స్వామి వార్లకు కళ్యాణ తలంబ్రాలను వేయించారు. వీరికి సర్పంచ్ బానోత్ కుమార్, ఎంపీటీసీ పెద్దబోయిన ఉమాశంకర్‌లు స్వాగతం ఫలికారు. అంబడి కృష్ణ దంపతులు, మార్కాల శేఖర్‌రెడ్డి. బన్సీలాల్ దంపతులు పీఠలపై కూర్చోని కల్యాణ తంతును జరిపారు. ఈసందర్బంగా భక్తులకు ఏర్పాటు అన్నదాన కార్యక్రమాన్ని జడ్పీచైర్మన్ కోరం కనకయ్య ప్రారంభించారు. కల్యాణోత్సవానికి ఇల్లందు, కారేపల్లి మండలాల నుండి భక్తులు పెద్దఎత్తున తరలివచ్చారు. ఈకార్యక్రమంలో సర్పంచ్ బానోత్ కుమార్, ఎంపీటీసీ పెద్దబోయిన ఉమాశంకర్, టీఆర్ఎస్ మండల అధ్యక్షప్రధాన కార్యదర్శులు తోటకూరి రాంబాబు, అజ్మీర వీరన్న, గ్రామపెద్దలు పాల్గొన్నారు.