Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కాంగ్రెస్ కార్యకర్తలపై తప్పుడు కేసులు పెడితే ఊరుకునేది లేదు
- మాజీ ఎంపీ రేణుకా చౌదరి
నవతెలంగాణ-కూసుమంచి
ఖమ్మం జిల్లాలో రాష్ట్ర మంత్రి పువ్వాడ అజరు కుమార్ హద్దుమీరి ప్రవర్తిస్తున్నారని, కాంగ్రెస్ కార్యకర్తలపై తప్పుడు కేసులు పెట్టి జైల్లో పెడుతున్నారని, ఈ పద్ధతి మార్చుకోకపోతే కాంగ్రెస్ కార్యకర్తల తడాఖా ఏంటో చూపిస్తామని, ఖబర్దార్ పువ్వాడ అని మాజీ ఖమ్మం పార్లమెంటు సభ్యురాలు రేణుకా చౌదరి హెచ్చరించారు. ఆదివారం మండలంలోని పాలేరు గ్రామంలోని కాంగ్రెస్ పార్టీ మహిళ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు రామసహాయం మాధవి రెడ్డి ఇంట్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె రైతు డిక్లరేషన్ సంబంధించి పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆమె మాట్లాడారు. సమావేశంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు మట్టా గురవయ్య, కాంగ్రెస్ అధికార ప్రతినిధి కొరివి వెంకటరత్నం, మండల నాయకులు నజీర్ భాషా, కుక్కల హనుమంతరావు, కేసర సంకీర్త్ రెడ్డి, శ్రీశైలం, బిక్షం, తిరుమలేష్, ప్రసన్నకుమార్ తదితరులు పాల్గొన్నారు.
రఘునాథపాలెం: మంచుకొండ గ్రామ పంచాయతీలో ఆదివారం గ్రామ సర్పంచ్ వాంకుడోత్ విజయ అధ్యక్షతన రచ్చబండ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ రచ్చబండ కార్యక్రమంలో మాజీ కేంద్ర మంత్రివర్యులు రేణుకా చౌదరి ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడుతూ తెలంగాణరాష్ట్రంలో ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని పరిస్థితి నెలకొందని, జీతాల కోసం ప్రభుత్వ భూములను అమ్ముకునే పరిస్థితి దాపురించిందని విమర్శించారు. అనంతరం నగర కాంగ్రెస్ అధ్యక్షులు మహమ్మద్ జావేద్ ఆధ్వర్యంలో గ్రామంలోని ప్రతి గడపకూ వెళ్లి వరంగల్ డిక్లరేషన్ పత్రాలను రైతులకు అందించారు. కార్యక్రమంలో మాజీ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ మానుకొండ రాధాకిషోర్, ఎడవల్లి కృష్ణ, ఎండి ముస్తఫా, నరేంద్ర, బానోతు కోటేష్ నాయక్, దుంపటి నగేష్, ఎంపిటిసి అశోక్, వాంకుడోత్ దీపక్ నాయక్, ప్రేమ్ కుమార్, నరసయ్య, చల్లా శ్రీనివాసరావు పాల్గొన్నారు.
కుక్కల గుట్టను కబ్జా బారి నుండి కాపాడాలని వినతి
పుటానీతండ గ్రామపంచాయతీ సమీపంలో కుక్కల గుట్టను కొతమంది కబ్జా చేస్తున్నారని పుఠాణి తండా రైతులు కేంద్ర మాజీ మంత్రి రేణుకా చౌదరికి వినతి పత్రం అందజేశారు. 100 సర్వేనెంబర్లో మొత్తం విస్తీర్ణం 170.29 ఉండగా గత 50 సంవత్సరాల నుండి గిరిజన పేద రైతులు సాగు చేస్తున్నారని, ఈ సాగు భూమి సమీపంలో మట్టి గుట్ట ఉందని, ఈ గుట్టను ఎలాగైనా కాజేయాలని అధికార పార్టీ నేతలు కుట్ర పన్నుతున్నారని అన్నారు. వినతి పత్రం అందేసిన వారిలో భూక్య నరేష్, భానోతు రమేష్ నాయక్, కోటేష్ నాయక్, అమరేంద్ర ఉన్నారు.