Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ- చింతకాని
చింతకాని మండల కేంద్రంలోని గ్రంథాలయానికి మాజీ సర్పంచ్ సరోజిని, జగన్ మోహన్ రావు దంపతుల ఆధ్వర్యంలో రూ 20 వేల రూపాయలు విలువచేసే 20 జాతీయ నాయకుల ఫోటోలు వితరణగా లైబ్రేరియన్ సుమలతకు ఆదివారం అందజేశారు. ఈ సందర్భంగా దాతలు మాట్లాడుతూ స్వాతంత్ర పోరాటంలో అమరులైన నాయకులు మరియు ప్రముఖ జాతీయ నాయకుల ఆశయాలను యువత సాధించాలని, అలాగే ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వం వరుసగా విడుదల చేస్తున్న ఉద్యోగ నోటిఫికేషన్లను లైబ్రరీలో కూర్చొని సదరు ఫోటోల ద్వారా యువతకు స్ఫూర్తి పొందుతూ తమ టార్గెట్ రీచ్ కావాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో రైతు బంధు సమితి మండల కన్వీనర్ కిలారు మనోహర్ బాబు , ఉప సర్పంచ్ కిలారు వేణుగోపాల్, ఎంపీటీసీ మేకనబోయిన రాంబాబు, పంచాయతీ కార్యదర్శి షేక్ సైదులు, గ్రామ శాఖ నాయకులు పటాన్ షబ్బీర్ ఖాన్, కిలారు బాబురావు, ఆకుల చంద్రయ్య, వార్డు సభ్యులు తదితరులు పాల్గొన్నారు.