Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి నున్నా
నవతెలంగాణ-కొణిజర్ల
బీజేపీ ప్రభుత్వం మొదటిసారి అధికారంలోకి వచ్చినప్పుడు ఉన్న పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు ఏ విధంగా ప్రజలకు అందుబాటులో ఉన్నాయో ప్రస్తుతం అదే ధరలకు ప్రజలకు అందుబాటులో ఉండేలా చర్యలు చేపట్టాలని సీపీఎం జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు డిమాండ్ చేశారు. మండల పరిధిలోని సీంగరాయపాలెం గ్రామంలో నవతెలంగాణ పత్రిక క్యాంపెయిన్లో ఆదివారం ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా నున్నా మాట్లాడుతూ సగానికిపైగా ధరలు పెంచి పేదల ప్రజలపై భారాలు మోపుతున్న బిజెపి ప్రభుత్వ విధానాలను ఎండగట్టాలని ఈనెల27 వ తేదీన పెట్రోల్, డీజిల్, గ్యాస్, వంటనూనె, సిమెంట్ తదితర ధరలు తగ్గించాలని సీపీఎం ఆద్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నట్లు ఈ ఆందోళనలో పార్టీ శ్రేణులు ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొని ధర్నాని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు భూక్యా వీరభద్రం, జిల్లా కమిటీ సభ్యులు తాళ్లపల్లి క్రిష్ణ, గోపాల్ రావు, మండల కార్యదర్శి చెరుకుమల్లి కుటుంబరావు, వడ్లమూడి నాగేశ్వరరావు, మధు, సంక్రాంతి, నర్సయ్య, ఆనుమోలు రామారావు, ఆటో యూనియన్ సీఐటీయూ మండల కన్వీనర్ పదిమల నరేష్ తదితరులు పాల్గొన్నారు.