Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఎర్రుపాలెం
పాడి రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలని, ప్రతి నెల రూ4 బోనస్ విజయ డైరీ మేనేజ్ మెంట్ పాల ఉత్పత్తి దారులు రైతులకు అందించాలని డిమాండ్ చేశారు. మండల కేంద్రమైన ఎర్రుపాలెంలోని విజయ డైరీ వద్ద పాడి రైతులు ఆదివారం ధర్నాకు దిగారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 2020 సంవత్స రం నుండి నాలుగు రూపాయల బోనస్ అందించడం లేదని, వాటిని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. నిత్యావసర ధరలు పెరిగినందున పాడి రైతులకు ప్రతి లీటర్ పాలపై రూ100 అందించాలని, ప్రతి నెల రూ4 బోనస్ అందించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పాడి రైతులు అమరవాది విజయ భాస్కర్ రెడ్డి, జోగంటి వెంకటరెడ్డి, షేక్ నాగుల్ మీరా, గుండు నర్సిరెడ్డి, బాదా నర్సిరెడ్డితరులు పాల్గొన్నారు.