Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ- కల్లూరు
ఈనెల 28, 29,.30 తేదీలలో తెలంగాణ రాష్ట్ర త్రో బాల్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో 27వ జాతీయ స్థాయి పోటీలకు ఆతిథ్య మివ్వనుంది భారతదేశం నలుమూలల నుంచి సబ్ జూనియర్ త్రో బాల పోటీలలో బాల బాలికల జట్లు పాల్గొనడం జరుగుతుంది ఈ పోటీలు సికింద్రాబాద్ డివిఎం పాఠశాలలో నిర్వహించనున్నారు. ఈ పోటీలకు తెలంగాణ రాష్ట్ర అసోసియేషన్ వారు ఈనెల 13 14 15 తేదీలలో కల్లూరు లో జరిగిన రాష్ట్ర స్థాయి పోటీలలో అత్యంత ప్రతిభ కనబరిచిన క్రీడాకారులను ఖమ్మం జిల్లా నుంచి రాష్ట్ర అసోసియేషన్ వారు ఎంపిక చేసినారు ఎంపికైన క్రీడాకారులు బాలికల విభాగం నుండి సాయి శ్రీ సౌమ్య. వీరిద్దరూ కూడాను జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పాండురంగాపురం.వి.లావణ్య ప్రభుత్వ ఉన్నత పాఠశాల కల్లూరు... బాలుర విభాగంలో నుండి జి మల్లేష్. ఆర్ రాకేష్. వీరిద్దరూ ప్రభుత్వ ఉన్నత పాఠశాల కల్లూరుకు చెందిన క్రీడాకారులు వీరి వివరాలను ఖమ్మం జిల్లా త్రో బాల్ అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు తల్లపురెడ్డి గౌతంరెడ్డి, కే.రాధాకష్ణ ట్రెజరర్ పి .కవిత అలాగే ఎంపిక అయినటువంటి క్రీడాకారిణి లను తోపుడు బండి ఫౌండేషన్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ సాధిక్ అలీ మరియు ప్రతిభా విద్యాసంస్థల అధినేత అక్కినేని ప్రసాద్, సెక్రటరీ అండ్ కరస్పాండెంట్ రఘు, అభినందించి జాతీయస్థాయిలో పతాకం సాధించాలని అభినందించి ఆశీర్వదించడం జరిగింది ఈ కార్యక్రమ సహాయ సహకారాలను కల్లూరు గేమ్స్ కమిటీ సభ్యులు వారి యొక్క సహాయ సహకారాలు అందించడం జరుగుతుంది. ప్రభుత్వ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు జి .మాధవరావు . వ్యాయామ దర్శకుడు టి.లక్ష్మీ నరసయ్య వ్యాయామ ఉపాధ్యాయుడు పసుపులేటి వీర రాఘవయ్య. క్రీడాకారులనుఅభినందించారు.