Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవ తెలంగాణ - బోనకల్
ప్రభుత్వ సంక్షేమ పథకాల అన్నింటిని అర్హులైన అన్ని వర్గాల ప్రజలకు అందేలా కృషి చేయాలని టీఆర్ఎస్ నాయకులను కార్యకర్తలను జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమల్ రాజు కోరారు. బోనకల్ మండల కేంద్రంలో టిఆర్ఎస్ నాయకులు యార్లగడ్డ రమేష్ ఇంట్లో ఆదివారం జరిగిన ఓ శుభ కార్యక్రమంలో జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమల్రాజు, వసంత రాణి దంపతులు హాజరయ్యారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతి కుటుంబానికి ఏదో ఒక సంక్షేమ పథకం అందే విధంగా సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారన్నారు. మధిర నియోజకవర్గ అభివద్ధికి కోట్లాది రూపాయలు నిధులు మంజూరు చేశారన్నారు. మధిర నియోజకవర్గ పరిధిలో కొన్ని వందల మందికి ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి నిధులు మంజూరు చేశారని తెలిపారు. ఏ ప్రభుత్వం చేపట్టని విధంగా పల్లె ప్రగతి పథకంలో అన్ని గ్రామ పంచాయతీలకు అవసరమైన అన్ని మౌలిక వసతులను కల్పించినట్లు తెలిపారు. అన్ని గ్రామ పంచాయతీల పచ్చని చెట్లతో ఆహ్లాదకరంగా ఉన్నాయన్నారు. రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందనివారు ఎవరైనా అర్హులు ఉంటే వారిని గుర్తించి అధికారులతో మాట్లాడి వారికి అందే విధంగా నాయకులు కషి చేయాలని కోరారు. కార్యక్రమంలో టిఆర్ఎస్ మండల అధ్యక్షుడు చేబ్రోలు మల్లికార్జున రావు మాజీ జెడ్పిటిసి బాణావత్ కొండా టిఆర్ఎస్ నాయకులు మోర్ల నరసింహారావు, యార్లగడ్డ రాఘవరావు, మోర్ల శ్రీనివాస్ రావు, నందిగామ పర్వత చారి, యార్లగడ్డ చిన్న నరసింహ, షేక్ సైదా తదితరులు పాల్గొన్నారు.
ముదిగొండ : చిరుమర్రి గ్రామంలో జడ్పీ చైర్మన్ లింగాల కమల్ రాజు ఆదివారం పర్యటించారు. ఈ సందర్భంగా గ్రామంలోని టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు పల్లెపాటి వెంకట్ కుమారుడి వివాహ శుభకార్యంలో పాల్గొని నూతన వధూవరులను ఆయన ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో గ్రామ ఉపసర్పంచ్ వినుకొండ రమేష్, టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు వాచేపల్లి లక్ష్మారెడ్డి, మండల మాజీ అధ్యక్షులు మీగడ శ్రీనివాస్ యాదవ్, టిఆర్ఎస్ పార్టీ నాయకులు చావాగాని వెంకట నాగప్రసాద్, బత్తుల వీరారెడ్డి, పసుపులేటి వెంకట్, కొడాలి కృష్ణారావు, ఓరుగంటి నాగేశ్వరరావు,మేడా ఎల్లయ్య,గాలి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.