Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - బోనకల్
తన జీవితమంతా దళితుల అభివృద్ధికి విశేషమైన కృషి చేసిన మహనీయుడు శ్రీ భాగ్యరెడ్డి వర్మ అని ఎంపీపీ కంకణాల సౌభాగ్యం, జెడ్ పి టి సి సుధీర్ బాబు అన్నారు. బోనకల్ మండల పరిషత్ కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు తొలిసారిగా ఆది ఆంధ్ర స్థాపకుడు శ్రీ భాగ్యరెడ్డి వర్మ జయంతి వేడుకలను ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి ఎంపీపీ కంకణాల సౌభాగ్యం జడ్పిటిసి మోదుగు సుధీర్ బాబు మండల పరిషత్ కార్యాలయ టైపిస్ట్ సతీష్ పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. కార్యక్రమంలో మండల పరిషత్ కార్యాలయ సిబ్బంది ఉమ, శ్రీనివాస రావు తదితరులు పాల్గొన్నారు.
ముదిగొండ : బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం కృషి చేసిన ఉద్యమ నాయకుడు భాగ్యరెడ్డి జయంతిని ముదిగొండ మండల పరిషత్ కార్యాలయంలో ఆదివారం నిర్వహించారు. కార్యక్రమంలో ఎంపీపీ సామినేని హరిప్రసాద్, తాసిల్దార్ తూమాటి శ్రీనివాస్, ఎంపీడీవో డి శ్రీనివాసరావు, ఎంపిఓ పి సూర్యనారాయణ, ఆర్ఐ వహీదాసుల్తాన్, వెంకటాపురం గ్రామసర్పంచ్ కోటి అనంతరాములు, నేలకొండపల్లి ఏఎంసి డైరెక్టర్ బంక మల్లయ్య, మండల పరిషత్ సిబ్బంది పాల్గొన్నారు.
ఖమ్మంరూరల్ : ఆది హిందూ ఉద్యమ నిర్మాత భాగ్యరెడ్డి వర్మ జయంతిని మండల పరిధిలో జలగంనగర్‌లోని ఎంపీడీవో కార్యాలయంలో శనివారం నిర్వహించారు.భాగ్యరెడ్డి వర్మ చిత్రపటానికి ఖమ్మంరూరల్ ఎంపీపీ బెల్లం ఉమ, జడ్పీటీసీ యండపల్లి వరప్రసాద్‌లు పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దళిత వైతాళికుడు భాగ్యరెడ్డి వర్మ అన్నారు. దళితుల అభ్యున్నతి కోసం పాఠశాలలు నిర్మించిన మహానీయుడన్నారు. కార్యక్రమంలో ఎంపీడీవో అశోకుమార్, కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.