Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఇల్లందు
మండలంలోని సిఎస్పి బస్తీ గ్రామపంచాయతీలోని రాజీవ్ నగర్, సున్నం రాజయ్య నగర్లో నూతనంగా నిర్మిచుకున్న ఇండ్లకు తక్షణమే ఇంటి నెంబర్లు కేటాయిం చి సమస్య పరిష్కరించాలని టిఏజి ఎస్, వ్యకాస ఆధ్వర్యంలో శుక్రవారం పంచాయతీ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భ ంగా టిఏజిఎస్ జిల్లా అధ్యక్షులు వజ్జ సురేష్, అవాజ్ జిల్లా కార్యదర్శి అబ్దుల్ నబి, వ్యకాస మండల నాయకులు ఆలేటి కిరణ్‌లు మాట్లాడుతూ స్థానికంగా ఉన్న రోడ్లు, కరెంట్, మంచినీటి సమస్యను పరిష్కరించాలని ఇండ్ల స్థలాల సమస్యను పరిష్కరించి అర్హులైన వారాందరికీ ఇండ్ల స్థలాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఏజెన్సీలో గిరిజనులకు హక్కులు, చట్టాలు ఉన్న కానీ గిరిజనులు జీవించలేని పరిస్థితి ఉందని అన్నారు. వారి పైన అధికారులు కక్షసాధింపు చర్యలకు పాల్పడుతున్నారని అన్నారు. తక్షణమే ఇండ్ల స్థలాల సమస్యను పరిష్కరించాలని గ్రామపంచాయతిలో మంచినీటి సమస్యను పరిష్కరించడం తో పాటు రోడ్లను నిర్మించాలని అన్నారు. నూతనంగా నిర్మించుకున్న ఇండ్లకు ఇంటి నెంబర్ లు కేటాయిస్తూ కరెంట్ మీటర్ లు కూడా ఇవ్వాలని అన్నారు. అదేవిదంగా పోడు భూములకు దరఖాస్తు చేసుకున్న వారందరికీ పట్టాలు ఇవ్వాలని, ఉపాధి పనులు కల్పించి జాబ్ కార్డు లు లేని వారికీ వెంటనే జాబ్ కార్డులు ఇవ్వాలని డిమాండ్ చేసారు. ఈ కార్యక్రమంలో రాందాస్, జయసుధ, శ్రీదేవి, కోటమ్మ, సరిత, రమేష్, వసంత,అనసూర్య, పాల్గొన్నారు.