Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్న అధికారులు
- సమస్యలు పై అధికారులను ప్రశ్నించిన సిపిఐ(ఎం) నేతలు
నవతెలంగాణ - అశ్వారావుపేట
పల్లె ప్రగతి పేరుతో ప్రభుత్వం ఉన్నతాధికారులకు స్థానిక అధికారులు తప్పుడు నివేదికలు ఇస్తూ ఇటు అధికారులను, అటు ప్రజలను తప్పు దోవ పట్టిస్తున్నారని సీపీఐ(ఎం) జిల్లా నాయకులు పిట్టల అర్జున్, బి.చిరంజీవిలు అన్నారు. ఐదవ పల్లె ప్రగతి లో శుక్రవారం అశ్వారావుపేట మేజర్ పంచాయితీ గ్రామసభను స్థానిక రోడ్లు భవనములు శాఖ అతిధి గృహం ప్రాంగణంలో సర్పంచ్ అట్టం రమ్య అద్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా పంచాయతీ అభివృద్ధికి సంబందించిన నివేదికను సభలో విడుదల చేసారు. ఇందు పారిశుధ్యంపై పొందుపరిచిన సమాచారం శుద్ద అబద్దమని నాయకులు అధికారులను నిలదీసారు. పంచాయతీలో 140 మురుగునీటి కాలువలు ప్రాధాన్యతా క్రమంలో శుభ్రం చేస్తున్నామని అధికారులు తెలుపగా... నేటికీ పూడిక తీయని కాలువలు సంగతి ఏంటని ప్రశ్నించారు. విశ్రాంత ఈ.ఓ లక్ష్మినారాయణ వీధిలో ఇరువైపులా మురికి కాలువలు పూడి పోయి ఉన్నాయాని సోదాహరణంగా సభికులకు వివరించారు. దీంతో ఈ.ఒ హరిక్రిష్ణ పునరావృతం కాకుండా చూస్తానని హామీ ఇచ్చారు. అయితే ఈ గ్రామ సభకు పులు శాఖల అధికారులు, అధికార పార్టీ స్థానిక ప్రజా ప్రతినిధులే డుమ్మా కొట్టడంతో చర్చాంశనీయం అవుతుంది.