Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జూన్ నెల మలేరియా మాసోత్సవాన్ని నిర్వహించాలి
- జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి డాక్టర్ కె.దయానంద స్వామి
నవతెలంగాణ-కొత్తగూడెం
రానున్న సీజన్లో అంటు వ్యాధులు ప్రభల కుండా అన్ని చర్యలు తీసుకోవాలని, జూన్ నెల మలేరియా మాసోత్సవాలు పురస్కరించుకుని సిబ్బంది ఇంటింటికి తిరిగి ర్యాపిడ్ ఫివర్ సర్వే నిర్వహించాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి డాక్టర్ కె.దయానంద స్వామి ఆరోగ్య సిబ్బందికి సూచించారు. శుక్రవారం డిఎంఅండ్ హెచ్ఓ కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. రానున్న సీజన్లో మలేరియా, డెంగ్యూ వ్యాధులను కట్టడి చేసేందుకు ముందు నుండి ప్రత్యేక చర్యలు తీసుకోవాలన్నారు. ఇంటింటికి వెళ్లి ర్యాపిడ్ ఫీవర్ సర్వేను నిర్వహించాలని, సమస్యాత్మాక గ్రామాలలో దోమల నిరవారణ మందులు పిచికారి చేయించాలన్నారు. ఈ కార్యక్రమంలో పిఓ ఎన్సీడి డాక్టర్ చేతన్, డిప్యూటి డిమో ఎండి.ఫైజ్మొయిద్దీన్, ఏఎంఓ గొంది వెంకటేశ్వర్లు, టిహెచ్యూబి లాబ్ మేనేజర్ సురేఖ, హెల్త్ ఎడ్యూకేటర్ టి.విజరుకుమార్, సబ్యూనిట్ ఆఫీసర్స్ కట్ట కుమార్స్వామి, లింగ్యా నాయక్, హరికృష్ణ, జేతు, ఏ.వెంకటేశ్వర్లు, భద్రు, నాగేష్ తదితరులు పాల్గొన్నారు.