Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎమ్మెల్యేకు వినతిపత్రం అందించిన పౌల్ట్రీ రైతులు
నవతెలంగాణ-సత్తుపల్లి
తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించేం దుకు కృషి చేయాలని సత్తుపల్లి మండలం కోళ్లఫారం రైతులు శాసనసభ్యులు సండ్ర వెంకటవీరయ్యకు విజ్ఞప్తి చేశారు. శుక్రవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాల యంలో రైతులు ఎమ్మెల్యేను కలిసి సమస్యలను వివరించి వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ సత్తుపల్లి మండలంలో సుమారు 200 రైతులు ఇంటిగ్రేషన్ బ్రాయిలర్ కోళ్లఫారాలు నిర్వహిస్తున్నారని తెలిపారు. మరో 100 కుటుంబాలు ఫారాలలో పనిచేస్తూ జీవనోపాధి పొందుతున్నారన్నారు. కొన్ని సమస్యలతో ఇబ్బందులు పడుతున్న తమను ప్రభుత్వం చొరవ చూపి ఆదుకోవాలని కోరారు. గ్రోయింగ్ ఛార్జెస్ కోడికి రూ.12కు పెంచాలని, వ్యాక్సిన్ సమస్యలను కంపెనీయే భరించాలని, 40-45 రోజుల వ్యవధిలో, 1-3 రోజుల్లో లిఫ్టింగ్ నిర్వహించాలని, లిఫ్టింగ్ ఛార్జెస్ కోడికి రూ.1 ఇవ్వాలని, మిగిలిన మేత కట్టలు కంపెనీ తీసుకెళ్లాలని, సుమారు 45 గ్రాముల నాణ్యమైన కోడిపిల్లలను ఇవ్వాలని తదితర డిమాండ్లను వివరించారు. సానుకూలంగా స్పందించిన ఎమ్మెల్యే సండ్ర సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు.