Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పనులకు రేగా శంకుస్థాపన
నవతెలంగాణ-మణుగూరు
మణుగూరు మండలం సింగారం గ్రామ పంచాయతీలోని డిగ్రీ కళాశాలలో పలు అభివృద్ధి పనులకు రాష్ట్ర ప్రభుత్వ విప్ పినపాక శాసనసభ్యులు రేగా కాంతారావు శంకుస్థాపన చేశారు. శుక్రవారం అనంతరం మాట్లాడుతూ కళాశాలలో సిసి రోడ్డుకు 10 లక్షలు కళాశాల, కళాశాల ఆధునీకరణకు మరో ఐదు లక్షలతో అభివృద్ధి చేస్తున్నామన్నారు. గ్రామాల సర్వతో ముఖభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. ప్రతి పల్లెల్లో సిసి రోడ్లు, బీటీ రోడ్లు డ్రైనేజీలు నిర్మాణం, గ్రామ పంచాయతీలకు నేరుగా నిధులు అందజేస్తున్న ఘనత తమ ప్రభుత్వానికే దక్కుతుందన్నారు. రాబోయే రోజుల్లో ఇంకా మరెన్నో అభివృద్ధి సంక్షేమ పథకాల కార్యక్రమాలతో ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతామన్నారు. ఈ కార్యక్రమంలో డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ బి శ్రీనివాస్, సిబ్బంది మరియు ప్రజాప్రతినిధులు నాయకులు పాల్గొన్నారు.