Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బట్టిగూడెం ఆదివాసులకు అండగా వుంటాం
- సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి కనకయ్య
నవతెలంగాణ-చర్ల
కలివేరు గ్రామ పంచాయతీ పరిధిలోగల బట్టిగూడెం గ్రామానికి చెందిన 50 కుటుంబాల ఆదివాసులు సీపీఐకి రాజీనామా చేసి సీపీఐ(ఎం) పార్టీలో చేరారు. మడకం సీతయ్య, వాసం చిన్నబ్బి, మడకం రామయ్య తదితరుల ఆధ్వర్యంలో పార్టీ జిల్లా కార్యదర్శి అన్నవరపు కనకయ్య, రాష్ట్ర కమిటీ సభ్యులు, మచ్చా వెంకటేశ్వర్లు, జిల్లా సీనియర్ నాయకులు యలమంచి రవికుమార్, జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు బ్రహ్మాచారి సమక్షంలో పార్టీలో చేరారు. పార్టీలో చేరిన వారికి నాయకులు కండువాలు కప్పి ఆహ్వానించారు. ఈ సందర్భంగా జిల్లా కార్యదర్శి కనకయ్య మాట్లాడుతూ.. బట్టిగూడెం ఆదివాసులకు పార్టీ అన్ని విధాలుగా అండగా వుంటుందని హామీ ఇచ్చారు. బట్టిగూడెం ఆదివాసుల సాగులో వున్న భూములకు హక్కు పత్రాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. 2002 నుండి స్ధిర నివాసం ఏర్పాటు చేసుకుని జీవిస్తున్న ఆదివాసులకు రాజ్యాంగం ప్రకారం కల్పించవలసిన హక్కులు, సౌకర్యాలను ప్రభుత్వాలు కల్పించక పోటం అన్యాయమని అన్నారు. స్ధానికంగా ఆధార్ కార్డు, రేషన్ కార్డు, ఓటర్ గుర్తింపు కార్డులున్నప్పటికీ విద్యార్దులకు కులం, ఆదాయం సర్టిఫికెట్స్ ఇవ్వక పోవటం, కళ్యాణ లక్ష్మి పధకం అమలు చేయకపోవటం ద్వారా ఆదివాల అభివృద్ధిని ప్రభుత్వం అడ్డుకుంటుందని విమర్శించారు.
సిపియం రాష్ట్ర కమిటీ సభ్యులు మచ్చా వెంటేశ్వర్లు మాట్లాడుతూ బట్టిగూడెం ఆదివాసులకు మిషన్ భగీరద మంచినీటి పైపు లైన్ ఏర్పాటు చేయాలని, కలివేరు నుండి బట్టిగూడెం వరకు సీసీ రోడ్డు నిర్మాణం చేపట్టాలని, అందరికి డబుల్ బెడ్ రూమ్ ఇల్లులు నిర్మించి ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఆదివాసుల హక్కుల కోసం నికరంగా పోరాడుతున్న సిపియం పార్టీలో చేరాలని స్వచ్చందగానిర్ణయించుకున్న బట్టిగూడెం ప్రజలకు అభినంధనలు తెలియజేశారు. పార్టీలో చేరిన వారిలో సోడి శ్రీను, సోడి మల్లయ్య, పూనెం గణపతి,కారం రవి తదితర గ్రామ పెద్దలువున్నారు. ఈ కార్యక్రమానికి పార్టీ మండల కమిటీ సభ్యులు కారం నరేష్ అధ్యక్షతన సభ జరగగా మండల కమిటీ సభ్యులు సమ్మక్క, మచ్చా రామారావు, ముత్యాలరావు, బోళ్ళ వినోద్, శ్యామల వెంకటేశ్వర్లు, బందల చంటి, సోడి.లక్ష్మి నర్సు, కుర్సం నాగేశ్వర రావు, కాంతయ్య, సోడి రమేష్ తదితరులు పాల్గొన్నారు.