Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఖమ్మం లీగల్
జూన్ నెల 26వ తారీకు జిల్లావ్యాప్తంగా నిర్వహించే జాతీయ లోక్ అదాలత్లో అధిక సంఖ్యలో కేసులు పరిష్కరించాలని న్యాయ సేవా సంస్థ కార్యదర్శి మొహమ్మద్ అబ్దుల్ జావీద్ పాషా పిలుపునిచ్చారు. శుక్రవారం సాయంత్రం న్యాయమూర్తి మూడవ అదనపు మెజిస్ట్రేట్ కోర్టులో న్యాయమూర్తి మరియు సంబంధిత పోలీసు అధికారులతో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా ఆయన జిల్లా ప్రధాన న్యాయమూర్తి డాక్టర్ శ్రీనివాసరావు లోక్ అదాలత్లో ఖమ్మం జిల్లాను ప్రథమ స్థానంలో నిలపాలనే కృతనిశ్చయంతో ఉన్నారని, అందుకు అనుగుణంగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని అన్నారు. ఈ లోక్అదాలత్లో పెట్టి కేసులతో పాటు ఇతర క్యాలెండర్ కేసులను పరిష్కరించడంలో కూడా శ్రద్ధ చూపించాలని అన్నారు. గత నెల 21వ తారీకు నాడు పోలీస్ అధికారుల సమావేశంలో జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఆదేశించిన విదంగా ప్రతి పోలీస్ స్టేషన్ నుండి లోక్ అదాలత్ నిమిత్తం ఒక ప్రత్యేక టీంను ఏర్పాటు చేయాలని అన్నారు. కార్యక్రమంలో మూడవ అదనపు జ్యూడిషల్ మెజిస్ట్రేట్ హైమ పూజిత, పోలీసు అధికారులు తదితరులు పాల్గొన్నారు.