Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ- కల్లూరు
ప్రభుత్వం పాఠశాలలోనే నాణ్యమైన విద్యను అందిస్తున్నామని ఉపాధ్యాయలు విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. మండలంలోని ప్రాధమిక, ప్రాధమికోన్నత, ఉన్నతపాఠశాలలోని ఉపాధ్యాయలు పాఠశాల పరిధిలోని గ్రామాలలో ప్రతి ఇంటికి వెళ్లి ప్రచారం చేస్తున్నారు. ప్రభుత్వం పాఠశాలలో జరుగుతున్న బోదన గురించి వివరిస్తున్నారు. ప్రయివేటు పాఠశాల కంటే ప్రభుత్వం పాఠశాలలోనే అన్ని సౌకర్యాలున్నాయనిప్రచారం చేస్తున్నారు .
వైరాటౌన్ : వైరా మండలం, గోళ్ళెనపాడు అప్పర్ ప్రైమరీ స్కూల్ ఉపాధ్యాయులు శుక్రవారం బడిబాట కార్యక్రమం నిర్వహించారు. పాఠశాల హెడ్మాస్టర్, సిబ్బంది, విద్యార్థినీ, విద్యార్థులు అందరూ కలిసి చాలా ఘనంగా బడిబాట కార్యక్రమాన్ని ప్రారంభించారు. విద్యార్థుల తల్లిదండ్రులకు ప్రభుత్వ పాఠశాల బోధనా పద్ధతులను, సదుపాయాలను వివరించారు. తల్లితండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చేర్పిస్తామని హామీ ఇచ్చారు.
కామేపల్లి : కామేపల్లి లో ప్రొఫెసర్ జయశంకర్ బడి బాట కార్యక్రమాన్ని శుక్రవారం ప్రారంభించారు. ప్రభుత్వ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఎస్ఎంసి కమిటీ చైర్మన్ అమర బోయిన తిరపయ్య, పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఎం.ఉమా శంకర్ బడిబాట కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు. సందర్భంగా గ్రామంలో ర్యాలీ నిర్వహించారు. ఉపాధ్యాయులు, విద్యార్థులు గ్రామంలోని ఇంటింటికి వెళ్లి బడిలో ప్రవేశం పొందే పిల్లల వివరాలను సేకరించారు. ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాలను ఉచిత విద్య, ఉచిత దుస్తుల పంపిణీ, స్పోకెన్ ఇంగ్లీష్, కంప్యూటర్ విద్య గురించి తల్లిదండ్రులకు తెలియజేశారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు సుధాకర్ రెడ్డి, కృష్ణనాయక్, శంకరయ్య, మణికుమారి, సిఆర్పి మోహన్, గ్రామస్తులు గంట సంపత్, రాము, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.
నేలకొండపల్లి : కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దాలనే లక్ష్యంతో ప్రభుత్వ పాఠశాలల్లోనే విద్యార్థులను చేర్పించాలని కోరుతూ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన బడిబాట కార్యక్రమాన్ని శుక్రవారం నేలకొండపల్లి మండలంలోని ప్రభుత్వ ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలతో పాటు అంగన్వాడి కేంద్రాలలో బడిబాట కార్యక్రమాన్ని వివిధ పాఠశాలల ఉపాధ్యాయులు ప్రారంభించారు. ఈ సందర్భంగా గ్రామాలలో ప్రజాప్రతినిధులు, పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులతో భారీ ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో హైస్కూల్ ప్రధానోపాధ్యాయురాలు కరుణకుమారి, గ్రామ సర్పంచ్ సుజాత, ఉప సర్పంచ్ ఆకుల వెంకటేశ్వర్లు, ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడు బిక్షం, అంగన్వాడీ టీచర్ కే.కోటేశ్వరి పాల్గొన్నారు.