Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కారేపల్లి : పల్లెప్రగతి 5వ విడుత కార్యక్రమాన్ని ప్రణాళికతో విజయవంతంచేయాలని కారేపల్లి ఎండీపీవో చంద్రశేఖర్ అన్నారు. శుక్రవారం కారేపల్లి మండలం కొమ్ముగూడెంలో పల్లె ప్రగతి కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. దీనిలో భాగంగా గ్రామంలో ర్యాలీ నిర్వహించారు. వీధుల్లో తిరిగి సమస్యలను గుర్తించారు. ఇండ్లలో పారిశుధ్యంపై గ్రామస్తులను చైతన్యం చేశారు. రహదారికి ఇరువైపు మొక్కల నాటారు. ఈసందర్బంగా సర్పంచ్ కల్తి భద్రమ్మ ఆధ్యక్షతన జరిగిన సమావేశంలో ఎంపీడీవో మాట్లాడుతూ పచ్చధనం పరిశుభ్రమైన పల్లె కోసం ప్రభుత్వం పల్లె ప్రగతి నిర్వహిస్తున్నట్లు తెలిపారు. పేరుపల్లిలో సర్పంచ్ అజ్మీర నాగేశ్వరరావు అధ్యక్షతన జరిగిన గ్రామసభలో సమస్యలపై చర్చించారు. ఎర్రబోడులో సర్పంచ్ కుర్సం సత్యనారాయణ ఆధ్వర్యంలో గ్రామంలో సమస్యల గుర్తింపు చేపట్టారు. ఈకార్యక్రమాలలో వైస్‌ఎంపీపీ రావూరి శ్రీనివాసరావు, ఎంపీవో రాజారావు, కార్యదర్శి భాస్కర్, నిరంజన్, ప్రవీణ్, ఉపసర్పంచ్లు బుడిగ ప్రభాకర్, వజ్జా నరేష్ ఐసీడీఎస్ సూపర్వైజర్ సుభద్ర పాల్గొన్నారు.
ముదిగొండ : ఐదోవిడత పల్లెప్రగతిలో భాగంగా ఈ నెల3 నుండి 18 తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించే పల్లెప్రగతి పనులు నిర్వహణ మండల పరిధిలో వల్లభి మేజర్ గ్రామ పంచాయతీలో శుక్రవారం అట్టహాసంగా ప్రారంభించారు. ఈసంద ర్భంగా ఆ గ్రామ పంచాయతీ సర్పంచ్ పోట్ల కష్ణకుమారి ఆధ్వర్యంలో గ్రామంలోని మొదటిరోజు వీధులన్నీ కలియతిరిగి, డ్రైనేజ్ కాలవలను పరిశీలించి, ప్రజలతో మాట్లాడి సమస్యలను ఆమె అడిగి తెలుసుకున్నారు. అనంతరం గ్రామపంచాయతీ కార్యాలయంలో గ్రామసభ నిర్వహించారు.సభలో సర్పంచ్ పోట్ల కష్ణకుమారి మాట్లాడుతూ ఈనెల 18వ తేదీ వరకు గ్రామంలోనే ఐదో విడత పల్లెప్రగతి పనులను ప్రతిష్టాత్మకంగా నిర్వహించి పారిశుద్ధ్యాన్ని తొలగించి పచ్చదనాన్ని పెంపొందించి,ప్రగతిబాటలో నడిపేందుకు ప్రజలందరూ సహకరించాలన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ సెక్రెటరీ ఎస్కె ఇంతియాజ్,గ్రామ స్పెషలాఫీసర్ సిహెచ్ వెంకట రామారావు రైతు సమన్వయసమితి మండల కన్వీనర్ పోట్ల ప్రసాద్ గ్రామ పంచాయతీ వార్డుసభ్యులు, అంగన్వాడి, ఆశ విద్యుత్, వైద్యసిబ్బంది పాల్గొన్నారు.
మధిర: ఖమ్మం జిల్లా జడ్పీ చైర్మన్ మరియు టిఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జ్ లింగాల కమల్ రాజు ఆదేశాల అనుసారం నాలుగో విడత పట్టణ ప్రగతి కార్యక్రమం మధిర మున్సిపాలిటీ పరిధిలోని 20వ వార్డు కౌన్సిలర్ ముత్తవరపు రాణి ప్యారి ఆధ్వర్యంలో ప్రారంబించారు. ఈ కార్యక్రమంలో వార్డు ఇన్చార్జి హర్షత్ ,ఆర్ పి మాధవి, వేముల శ్రీను, కోలా కొండ చిదురాల రాంబాబు, మందడపు రామకష్ణ, నాగులవంచ రామారావు, అశోక్ వార్డు అభివద్ధి సభ్యులు పాల్గొన్నారు
కామేపల్లి : గ్రామ అభివృద్ధికి ప్రత్యేక కృషి చేస్తున్నట్లు గరిడేపల్లి గ్రామపంచాయతీ సర్పంచ్ ధరావత్ రాంజీ అన్నారు. మండల పరిధిలోని గ్రామాల్లో శుక్రవారం పల్లె ప్రగతి కార్యక్రమం ప్రారంభమైంది. తొలిరోజు గ్రామంలో ర్యాలీ నిర్వహించి సమస్యలను గుర్తించారు .అనంతరం గ్రామ పాలకవర్గం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలో గుర్తించిన పనులను వివరాలను ప్రజలకు తెలియజేశారు. మండల పరిధిలోని టేకుల తండా పింజరమడుగు గ్రామాల్లో ఎంపీడీవో సిలార్ సాహెబ్ పర్యటించి పల్లె ప్రగతి కార్యక్రమం పై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శులు రాశేఖర్, విజయ నెహ్రు, గ్రామ పాలక వర్గం, పొన్నెకల్ల్ ఎంపీటీసీ మాలోతు శంకర్ నాయక్ గ్రామ ప్రత్యేక అధికారులు, సిబ్బంది ప్రజలు పాల్గొన్నారు.
నేలకొండపల్లి : గ్రామీణ ప్రాంతాలలో ప్రజా సమస్యల పరిష్కారం, పల్లెలప్రగతే ధ్యేయంగా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పల్లెప్రగతి కార్యక్రమంలో ప్రజలందరికీ భాగస్వాములు చేయాలని ఎంపీడీవో కె జమలారెడ్డి అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 3వ తేదీ నుంచి 18వ తేదీ వరకు చేపట్టిన పల్లెప్రగతి కార్యక్రమంలో భాగంగా శుక్రవారం మండలంలోని బోదులబండ, మండ్రాజుపల్లి గ్రామాలలో చేపట్టిన పల్లెప్రగతిని ఎంపీడీవో ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాల్లో ప్రజాప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు, గ్రామస్తులతో భారీ ర్యాలీ నిర్వహిం చారు. గ్రామపంచాయతీ కార్యాలయంలో గ్రామసభ నిర్వహించి, గ్రామంలో ప్రజా సమస్యలను గుర్తించడంతో పాటు గ్రామాభివద్ధి ప్రణాళికను తయారు చేశారు. కార్యక్రమంలో ఎంపీపీ వజ్జా రమ్య, స్పెషల్ ఇంచార్జ్ దుర్గ భవాని, సిడిసి చైర్మన్ నెల్లూరి లీలాప్రసాద్, సర్పంచ్ నెల్లూరి అనురాధ, వార్డు సభ్యులు, గ్రామ పంచాయతీ కార్యదర్శి రజిత, వివిధ శాఖల అధికారులు, గ్రామస్తులు పాల్గొన్నారు.
కల్లూరు : తెలంగాణా ప్రభుత్వం చేపట్టిన 5వ విడత కార్యక్రమం మండలంలో అన్ని గ్రామ పంచాయతీలలో శుక్రవారం ప్రారంభమైనాయి. కార్యక్రమన్ని తహసీల్దార్ జె.బాబ్జీప్రసాద్ రఘునాథగూడెంలో పరిశీలించారు. ఎపిఎం వెంకటరామారావు ముగ్గువెంకటపురం గ్రామంలో పరిశీలించారు.
చింతకాని :తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పల్లె ప్రగతి ప్రణాళికలను పకడ్బందీగా అమలు చేయాలని చింతకాని ఎంపీడీవో శ్రీనివాస్ అన్నారు శుక్రవారం మండల వ్యాప్తంగా గ్రామాల్లో పల్లె ప్రగతి కార్యక్రమాన్ని ఆయా సర్పంచుల ఆధ్వర్యంలో నిర్వహించారు నాగిలి గొండ గ్రామంలో పల్లె ప్రగతి సన్నాహక సమావేశానికి ఆయన హాజరయ్యారు ఈ సందర్భంగా ముందుగా పల్లె ప్రగతి ప్రణాళిక రికార్డులను పరిశీలించిన అనంతరం ఆయన మాట్లాడారు. గ్రామంలో పాదయాత్ర నిర్వహించి పలు సమస్యలను గుర్తించారు. గ్రామ సభలో మాట్లాడుతూ గుర్తించిన సమస్యలన్నిటిని పూర్తి చేసేలా ప్రణాళికలు సిద్ధం చేయాలన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ చాట్ల సురేష్ ఎం పి టి సి భగవాన్ ఎం పి ఓ మల్లెల రవీంద్ర ప్రసాద్ పంచాయతీ కార్యదర్శి కొండపల్లి అనిల్ కుమార్ సర్పంచులు ప్రజా ప్రతినిధులు పంచాయతీ కార్యదర్శులు ప్రత్యేక అధికారులు పాల్గొన్నారు.
బోనకల్ : బోనకల్ గ్రామంలో లో విడత పల్లె ప్రగతి అభివృద్ధి పనులకు ప్రజలు అందరూ సహకరించాలని ఆ గ్రామ సర్పంచ్ బుక్యా సైదానాయక్ కోరారు. బోనకల్లు గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద పల్లె ప్రగతి పనులపై గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో గ్రామసభ నిర్వహించారు. ఈ సభలో ఆయన మాట్లాడుతూ గ్రామంలో ఎటువంటి సమస్య ఉన్నా తన దృష్టికి తీసుకువస్తే పల్లె ప్రగతి పనులలో పూర్తి చేస్తానని తెలిపారు. అనంతరం ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మండల పరిషత్ ఉపాధ్యక్షుడు గూగు లోతు రమేష్ గ్రామ పంచాయతీ కార్యదర్శి దామల్ల కిరణ్, మల్టీపర్పస్ వర్కర్లు అంతోటి రమేష్, మంద నాగరాజు, అంతోటి నాగేశ్వరరావు అంగన్వాడీ కార్యకర్తలు నాగమణి తదితరులు పాల్గొన్నారు.