Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నిర్వాసితులకు న్యాయం జరిగే వరకూ పోరాటం
- సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి కనకయ్య
నవతెలంగాణ-చర్ల
మండలంలోని 22 గ్రామాల పరిధిలో 2500 కుటుంబాలు సాగు చేసుకుంటున్న కోరేగడ్డ పేరుతో పిలవబడే గోదావరి లంక భూములు ఉన్నాయని, సీతమ్మసాగర్ ప్రాజెక్టు ఫలితంగా ఆ భూమిపై ఆధారపడి జీవనాధారం సాగిస్తున్న 2500 కుటుంబాలు నిర్వాసితులుగా మారుతున్నారని, వీరందరికీ 2013 భూసేకరణ చట్టం ప్రకారం నష్టపరిహారం చెల్లించాలని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి కనకయ్య డిమాండ్ చేశారు. శనివారం పార్టీ మండల కమిటీ సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ప్రాజెక్టులు అభివృద్ధి కార్యక్రమాల కింద నిర్వాసితులు అవుతున్న పేద ప్రజల పట్ల ప్రభుత్వాలు వివక్షత చూపుతున్నాయని, 2013చట్ట ప్రకారం వీరికి రావలసిన నష్ట పరిహారం చెల్లించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. నిర్వాసితులు అందరూ దళిత, బీసీ, గిరిజన సామాజిక తరగతులకు సంబంధించిన నిరుపేదలని, వీరి పట్ల ప్రభుత్వం సానుకూలంగా వ్యవహరించి అందరికీ పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. నిర్వాసితులకు అండగా గత కొంతకాలంగా సీపీఐ(ఎం) నిర్వహిస్తున్న పోరాటాలను మరింత ఉధృతం చేస్తామని, నిర్వాసి తులకు న్యాయం జరిగే వరకూ పార్టీ అండగా ఉంటుందని పేర్కొన్నారు. భూసేకరణ చట్టాన్ని అమలు చేయ డంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందన్నారు. అనంతరం పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు వెంక టేశ్వర్లు మాట్లాడుతూ మండలంలో పదిహేడు వేల ఎకరాలలో ఐదువేల గిరిజన పేద కుటుంబాలు పోడు భూములు సాగు చేసుకుంటున్నా రన్నారు. వీరందరికీ హక్కు పత్రాలు రావాల్సి ఉందని అటవీ హక్కుల గుర్తింపు చట్టం ప్రకారం హక్కు పత్రాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. 2021 నవంబర్ డిసెంబర్ నెలలో సాగుదారుల నుండి నుండి ప్రభుత్వం స్వీకరించిన దరఖా స్తులకు నేటి వరకు పరిష్కారం లేదని ఇప్పటివరకు దర ఖాస్తుదారులకు సమాధానం కూడా ఇవ్వలేదన్నారు. సమ స్య పరిష్కారం కోసమా? లేక నాన్చడం కోసమా? ఎందు కు దరఖాస్తులు తీసుకున్నారు? తీసుకున్న దరఖాస్తులు ఎందుకు పరిష్కారం చేయడం లేదో ప్రభుత్వం సమా ధానం చెప్పాలని సీపీఐ(ఎం) డిమాండ్ చేసింది. మండ లంలో అర్హత కలిగిన దళిత కుటుంబాల అందరికీ దళిత బంధు వర్తింపు చేయాలని డిమాండ్ చేశారు. దళిత బం దు లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియను గ్రామ సభల ద్వారా పారదర్శకంగా ఎంపిక చేయాలన్నారు. మండలంలో పేరుకుపోయిన ప్రజా సమస్యల పరిష్కారం కోసం పార్టీ ఆధ్వర్యంలో దశలవారీ ఆందోళనలు పోరాటాలు నిర్వ హించాలని పార్టీ మండల కమిటీ నిర్ణయించిందని తెలి పారు. మండల కమిటీ సమావేశానికి చీమలమర్రి మురళి అధ్యక్షత వహించగా పార్టీ జిల్లా సీనియర్ నాయకులు యలమంచి రవికుమార్, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కె.బ్రహ్మాచారి, మండల కమిటీ సభ్యులు నరేష్, ముత్యాలరావు, సమ్మక్క, రామారావు, వెంకటేశ్వర్లు, వినోద్, చంటి, రాధాకుమారి తదితరులు పాల్గొన్నారు.