Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-దమ్మపేట
మండల పరధిలోని మంద లపల్లి గ్రామ పంచాయతీలో తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలలు కార్పొరేట్ స్కూల్స్ గా తీర్చిదిద్దాలని సీఎం కేసీఆర్ ధృడ సంకల్పంతో మన ఊరు- మనబడి కార్యక్రమాన్ని విద్యార్థులకు అంకితం చేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా మందలపల్లి స్కూలుకి రూ.14 లక్షల మంజూరు చేసి ఎమ్మెల్యే నాగేశ్వరరావు ఆదేశానుసారం శనివారం జడ్పీటీసీ పైడి వెంకటేశ్వరరావు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. అంతే కాకుండా ప్రకాష్ నగర్ కాలనీలో రూ.ఆరు లక్షల డెబ్బై వేల పాఠశాల మరమ్మతులకు మంజూరు చేశారు. అలాగే అల్లిపల్లి గ్రామంలోని మన ఊరు-మనబడి కార్యక్రమాన్ని కూడా జడ్పీటీసీ పైడి వెంకటేశ్వరరావు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎంఈవో కీసరి లక్ష్మి, పాఠశాలల సిబ్బంది, మండల పార్టీ అధ్యక్షులు రాజేశ్వరరావు, ఎంపీపీ సోయం ప్రసాద్, వైస్ ఎంపీపీ మల్లిఖార్జునరావు, గారపాటి సూర్యనారాయణ, ఎంపీటీసీ అజరు తదితరులు పాల్గొన్నారు.