Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఉద్యోగాలు సాధిస్తామనే లక్ష్యంతో ముందుకు వెళ్లాలి
- భద్రాచలం టౌన్ సీఐ నాగరాజు రెడ్డి
నవతెలంగాణ-భద్రాచలం
గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నడుపబడుతున్న ఎస్సై, పోలీస్ కానిస్టేబుల్ శిక్షణలోని గిరిజన అభ్యర్థులు క్రమశిక్షణతో నేర్చుకొని పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకోవాలని భద్రాచలం టౌన్ సీఐ నాగరాజు రెడ్డి అన్నారు. శనివారం పీఎంఆర్సీ భవనంలో జరుగుతున్న ఎస్సై, పోలీస్ కానిస్టేబుల్ శిక్షణా కేంద్రాలను ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా పీఎంఆర్సీ, ఏసీఎంఓ, రమణయ్య సమక్షంలో ఆయన మాట్లాడుతూ గిరిజన అభ్యర్థుల కొరకు నిర్వహిస్తున్న ఉచిత శిక్షణను అభ్యర్థులు ప్రత్యేక శ్రద్ధ కనబరిచి నేర్చుకోవాలని ఆయన అన్నారు. అనంతరం ఏసీఎంఓ, రమణయ్య మాట్లాడారు. భవిష్యత్తును కాపాడుకొని ఉద్యోగాలు సాధించాలని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో టౌన్ ఎస్ఐ మధు ప్రసాద్, మోటివేటర్, కానిస్టేబుల్, ప్రసాద్, ప్రోగ్రాం ఇంచార్జ్ వెంకటేశ్వర్లు, శిక్షణ ఫ్యాకల్టీలు తదితరులు పాల్గొన్నారు.