Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఐదేండ్లు దాటిన ప్రతి ఒక్కరూ బడికి రావాలి
- కలెక్టర్ అనుదీప్
నవతెలంగాణ-కొత్తగూడెం
ఐడేండ్లు దాటిన ప్రతి ఒక్కరూ బడికి రావాలని, బడి ఈడు పిల్లలను గుర్తించి బడులలో చేర్పించాలని కలెక్టర్ అనుదీప్ తెలిపారు. శనివారం బడిబాట కార్యక్రమంపై కలెక్టరేట్ సమావేశపు హాలులో విద్యా, మహిళా శిశు సంక్షేమ, డీఆర్డీఏ, కార్మికశాఖ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి మనిషికి చదువు ఎంతో ముఖ్యమన్నారు. కరోనా వల్ల రెండేండ్లు బడులు నిర్వహించుకోడానికి అవకాశం లేకుండా పోయిందాన్నారు. పరిస్థితులు చక్కబడినందున చిన్నారులు ఆనందంగా బదులకు వచ్చే విధంగా బడిబాట కార్యక్రమాలను నిర్వహించాలని చెప్పారు. జిల్లాలో 205 మంది బడిఈడు పిల్లలు డ్రాపవుట్స్ ఉన్నట్లు గుర్తించామని, వారందరినీ బడులకు రప్పించాల్సిన బాధ్యత తీసుకోవాలని విద్యాశాఖ అధికారులకు సూచించారు. ఇటుక బట్టీలు, కార్ఖానాలు తదితర వాటిలో పనులు చేస్తున్న బాల కార్మికులను ప్రత్యేక డ్రైవ్ చేపట్టి గుర్తించాలని, బడులలో చేర్పించాలని చెప్పారు. ఈ సమావేశంలో డిఈఓ సోమశేఖరశర్మ, మహిళా శిశు సంక్షేమ అధికారి వరలక్ష్మి, కార్మికశాఖ అధికారి రవి, ఏపి నీలేష్, అన్ని మండలాల యంఈఓలు, తదితరులు పాల్గొన్నారు.