Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రభుత్వ విప్ రేగా
నవతెలంగాణ-మణుగూరు
క్రీడలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని, క్రీడల వలన మానసికోల్లాసం కలుగుతుందని ఎమ్మెల్యే రేగా కాంతారావు అన్నారు. శనివారం పికెవన్ సెంటర్ నందు క్రీడా ప్రాంగణంలో జరుగుతున్న పనులను సంబంధిత అధికారులతో కలిసి సందర్శించి పనుల పురోగతిని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అన్ని వర్గాల సంక్షేమంతో పాటు పల్లెల్లో చదువుకుంటున్న విద్యార్థులు యువకులు సైతం క్రీడల్లో రాణించాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం పల్లె పల్లెకో క్రీడాప్రాంగణం ఏర్పాటు చేస్తున్నదన్నారు. దీనిని క్రీడాకారులు వినియోగించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో మండల టీఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, పార్టీ సీనియర్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
పట్టణ ప్రగతితో మారనున్న మణుగూరు రూపురేఖలు
పల్లె, పట్టణ ప్రగతితో మణుగూరు రూపురేఖలే మారనున్నాయని ప్రభుత్వ విప్ పినపాక శాసనసభ్యులు కాంతారావు అన్నారు. శనివారం మున్సిపాలిటీ పరిధిలోని బండారి గూడెం ప్రధాన రహదారిపై ఉన్న రెండు వాగులలో పేరుకుపోయిన చెత్త, పెరిగిన మొక్కలను తొలగించేందుకు పనులు ప్రారంభించారు. పీకే వన్ సెంటర్ నందు పట్టణ క్రీడ ప్రాంగణాన్ని పనులను పరిశీలించారు.
అనంతరం ఆయన మాతో మాట్లాడుతూ సమగ్ర అభివృద్ధి కోసమే పల్లె, పట్టణ ప్రగతి సాకారం అవుతుందన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ కె.మాధవి, ఏఈ సత్యనారాయణ, కోటేశ్వరరావు, జడ్పీటీసీ నరసింహారావు, ఎంపీపీ కారం విజయ కుమారి, పీఏసీఎస్ చైర్మన్ నాగేశ్వరరావు, ప్రజా ప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.