Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-అన్నపురెడ్డిపల్లి
పోడు భూములను వదులుకునేది లేదని, పోడు నుండి కదిలేది లేదని పోడు సాగు చేసుకుంటున్న గిరిజనులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. శనివారం కంపగుడెం నామవారం గ్రామానికి చెందిన గిరిజనులు, ఫారెస్ట్ అధికారులు గత రెండేండ్ల క్రితం నాటిన మొక్కలను నారికినారు. మద్దుకురు ఈస్ట్ బీట్లో గల మండల పరిధిలోని కంపగుడేం పెంట్లం నామవరం సరిహద్దుల్లో గల ఫారెస్ట్ 94 హెక్టార్లు వుండగా ఆ భూమి మాధి అంటే మాది అని ఫారెస్ట్ అధికారులు పోడు సాగుదారులు మధ్య గత కొన్నేండ్లుగా వివాదం కొనసాగుతుంది. సుమారు 20 సంవత్సరాల నుండి పోడు సాగు చేసుకుంటు జీవనం సాగిస్తున్నామని గిరిజనులకు ఎటువంటి హక్కు పత్రాలు లేవని, ఫారెస్ట్ అధికారులు వీరి మధ్య వివాదం సాగుతుండగా శనివారం సుమారు 94 హెక్టార్ల వుండగా వాటిలో సుమారు 23 హెక్టార్లలో నాటిన మొక్కలను తొలగించడంతో గమనించిన ఫారెస్ట్ అధికారులు ఉన్నత అధికారులకు సమాచారం ఇచ్చారు. రేంజర్ శ్రీనివాసరావు నేరుగా బీట్లోకి వచ్చి వారిని హక్కు పత్రాలు చూపించాలని, ఫారెస్ట్ నుండి వెళ్లిపోవాలని వాధించగ పోడు కోసం ఇక్కడే వుంటామని, భూమి కోసం చనిపోవడానికి అయినా సిద్ధంగా ఉన్నామని గిరిజనులు తేల్చి చెప్పారు. రంగంలోకి యఫ్డీఓ అప్పయ్య వచ్చి సమస్య పరిష్కారం చర్చలతో సాధ్యం అవుతుందని, నాటిన మొక్కలను తొలగించడంతో కాదనిన్నారు. గతంలో పోడు కోసం దరఖాస్తు చేసుకున్నవారు రాష్ట్రం మొత్తం వున్నారని, ఎటువంటి వివాదాలకు గిరిజన పోడు సాగుధారులు వెళ్ళ వద్దు అని సమస్య పరిష్కారం కోసం ఆర్డీఓ పీఓ ఉన్నత అధికారులు దృష్టికి తీసుకు పోయి సమస్యను పరస్కరించి అటవీ హక్కుల చట్టం ప్రకారం అర్హులని గుర్తిస్తామ న్నారు. ప్రభుత్వం దగ్గర గతంలో చేసిన షాట్ లైట్ సర్వే వుందని, సర్ది చెప్పడంతో వివాదం ముగిసింది. కానీ వర్ష కాలం సమీపిస్తుండటంతో పోడు భూముల్లో పంట సాగు చేసుకుంటామని, గతంలో 90 ఎకరాల పత్తి సాగు చేసుకుంటుంటే ఫారెస్ట్ అధికారులు పంటలు ధ్వంసం చేశారని గిరిజనులు ఆవేధన వ్యక్తం చేశారు.
శాంతి భద్రత లు ఎటువంటి విఘాతం కలగకుండా సర్కిల్ ఇన్సపెక్టర్ వసంతరావు, సబ్ ఇన్స్పెక్టర్ విజయ, పోలీస్ సిబ్బంది రామారావు, రాము తదితరులు ఉన్నారు. ఈ కార్యక్రమంలో పోడు సాగుదారులు కొర్స వెంకటేశ్వర్లు, లక్ష్మి, ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ నాగరాజు, బీట్ ఆఫీసర్లు పాల్గొన్నారు.