Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ములకలపల్లి
చట్టవిరుద్ధంగా ములకలపల్లి మండలంలో జరుగుతున్న మూడు బాల్య వివాహాలను అధికారుల బృందం శనివారం నిలిపివేసింది. చైల్డన్ 1098 అధికారులకు వచ్చిన సమాచారం మేరకు చైల్డ్ లైన్ 1098, ఐసీడీఎస్, రెవెన్యూ, పోలీస్, డీసీపీయూ శాఖల అధికారులు సంయుక్తంగా మండలంలో వేర్వేరుగా జరుగుతున్న బాలికల వివాహాల సమచారం తెలుసుకుని కుటుంబసభ్యుల వద్దకు వెళ్లి వివాహాలను నిలిపివేసి కుటుంబసభ్యులకు కౌన్సిలింగ్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చైల్డ్ లైన్ 1098 జిల్లా సమన్వయకర్త రాజకుమార్, సీడీపీవో రేవతి, సూపర్వైజర్ నాగమణి, గిర్దావర్లు తారా చంద్, ఎన్.వెంకటేశ్వర్లు, పోలీస్ హెడ్ కానిస్టేబుల్ ప్రకాష్ రావు, రాంమూర్తి, డీసీపీయూ కౌన్సిలర్ వి.కల్యాణి, చైల్డ్ లైన్ సిబ్బంది బషీర్, అంగన్వాడీ కార్యకర్తలు పాల్గొన్నారు.