Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రాష్ట్రంలో శాంతిభద్రతలు ఉన్నాయా లేవా..
- విలేకరుల సమావేశంలో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
నవతెలంగాణ-అశ్వాపురం
గత నెల 28వ తేదీన హైదరాబాదులోని ఓ పబ్బు నుండి ఐదుగురు యువకులు ఓ మైనర్ బాలికను వారి వాహనాల్లో తీసుకుని వెళ్లి జూబ్లీ హిల్స్ ప్రాంతంలో అత్యాచారం చేసిన ఘటనలో ప్రభుత్వం ఎందుకు నత్తనడకన దర్యాప్తు సాగిస్తోందని బీఎస్పీ రాష్ట్ర చీప్ కోఆర్డినేటర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. శనివారం మండల పర్యటనలో భాగంగా మండల కేంద్రంలోని ఎస్సీ కాలనీలో విలేఖర్ల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో శాంతిభద్రతలు ఉన్నాయా లేవా అన్నారు. పెద్ద వాళ్లకు ఒక న్యాయం పేదలకు మరొక న్యాయం ఏంటని ప్రశ్నించారు. పినపాక నియోజకవర్గంలో ప్రజా సమస్యల పరిష్కారంలో స్థానిక ఎమ్మెల్యే విఫలమయ్యాడని ఎద్దేవా చేశాడు. రాష్ట్రంలో 11 లక్షల మంది పెన్షన్లు రాక ఎదురు చూస్తున్నారన్నారు. ఈ సమావేశంలో బీస్పి జిల్లా అధ్యక్షులు యెర్ర కామేష్, నాయకులు ఇర్ఫాన్ రవికుమార్, శివ, రఘు, కామరాజు, వీరయ్య, సతీష్, హరిబాబు పాల్గొన్నారు.