Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎర్రజెండా నీడలో పేదలకు ఇళ్లస్థలాలు పంపిణీ
- రోడ్లు, విద్య, విద్యుత్ సదుపాయాల కల్పనలో అగ్రగామి
- గ్రామసర్పంచ్‌గా మూడు దశాబ్దాలపాటు ఏకగ్రీవం
- నేడు బుగ్గవీటి రంగయ్య 14వ వర్ధంతి
నవతెలంగాణ-ముదిగొండ
ముదిగొండ మండలం పమ్మి గ్రామంలో ఉన్నతమైన కుటుంబంలో పుట్టి పేదలను సాకిన పుణ్యమూర్తి బుగ్గవీటి రంగయ్య. 1922లో పమ్మి గ్రామంలో జన్మించిన బుగ్గవీటి రంగయ్య భూమికోసం భుక్తి కోసం పేదల విముక్తికై ఆనాడు జరుగుతున్న పోరాటంలో నూనుగు మీసాల వయసులో సిపిఐ(ఎం) జెండాను పట్టుకుని పేదలపక్షాన నిలిచాడు. చిరుమర్రి, మల్లన్నపాలెం, పమ్మి గ్రామాల పరిధిలోని ప్రజాసమస్యల పరిష్కారానికి తన వంతుగా బుగ్గవీటి రంగయ్య కృషి చేశారు. అప్పట్లో గ్రామాలకు సరైన రహదారి లేకపోవడంతో ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్న తరుణంలో రహదారుల నిర్మాణం చేపట్టి ప్రజానాయకుడిగా గుర్తింపు పొందారు. బుగ్గవీటి రంగయ్య అప్పట్లో ప్రధానంగా పమ్మి గ్రామంలోని కాంగ్రెస్ భూస్వామి అరాచకశక్తుల నుండి పార్టీని ప్రజలను కాపాడటంలో ఆయన కీలకపాత్ర పోషించారు. ప్రజాఉపయోగకర కార్యక్రమాలు నిర్వహిస్తున్న రంగయ్యను ప్రజలు ఆదరించి అభిమానం చూపి మూడు దశాబ్దాలపాటు గ్రామపంచాయతీ సర్పంచ్‌గా ఏకగ్రీవం చేశారు. తనను నమ్ముకున్న ప్రజల కష్టజీవుల కోసం నిర్బంధాల సైతం లెక్కచేయకుండా మనోధైర్యంతో గ్రామాభివృద్దికి బాటలు వేశారు. అప్పట్లో మూడు గ్రామాలకు కలిపి ఒకపంచాయతీగా ఉండేది. పమ్మి, చిరుమర్రి, మల్లన్నపాలెం గ్రామాలు కలిపి గ్రామపంచాయతీ పాలన కొనసాగేది. ఈగ్రామపంచాయతీకి రంగయ్య పంచాయతీ సర్పంచ్ గా ముప్పై సంవత్సరాలు తన హయాంలోనే గ్రామాల అభివృద్ధికి కృషి చేసి ప్రజల ఆదరాభిమానాలను చూరగొన్నారు. ఆనాడు గ్రామంలో సిపిఐ(ఎం) బలమైన పునాది కలిగిన ఉద్యమ పార్టీ గ్రామానికి ఇరువైపులా ఎటు చూసినా రోడ్ల సౌకర్యం లేకపోవడంతో చిరుమర్రి, కమలాపురం, పమ్మి రోడ్ల సౌకర్యంతోపాటు గ్రామానికి విద్యుత్, విద్య హైస్కూల్ నిర్మాణం వరకు అభివృద్ధి చేసిన ఘనత బుగ్గవీటి రంగయ్యకే దక్కింది. గ్రామంలోను బడుగు బలహీన దళిత బహుజనులకు ఇంటి స్థలాలకై పోరుచేసి ఎర్రజెండా నాయకత్వాన పేదలకు ఇంటి స్థలాలు పంపిణీచేసి విజేతగా నిలిచారు. వ్యవసాయ కార్మికులకు అండగా ఉండి కూలిరేట్ల పెంపునకు కృషి చేశారు. రంగయ్య ముఖ్యంగా పమ్మి గ్రామ దళితులను కొంతమంది అగ్రకులాలవారు ఆనాడు అంటరానివారిగా చూస్తున్న సమయంలో దళితులకు అండగా ఉండి కులమతాలు లేవంటూ గర్జించాడు. తన ఇంటినే పార్టీ కార్యాలయంగా మార్చి తన ఇంటికి వచ్చిన పార్టీ కార్యకర్తలకు ప్రజలకు అన్నం పెట్టి ఆకలి తీర్చిన అన్నదాత బుగ్గవీటి రంగయ్య గ్రామంలోని ఎమర్జెన్సీ కాలంలో ప్రజలకు అండగా ఉండి గ్రామానికి రక్షణకవచంలా ఉక్కు మనిషిలా పనిచేశారు. రంగయ్య మార్కిస్టు పార్టీ ఉద్యమ నాయకులు రావెళ్ళ సత్యం, గండ్లూరి కిషన్ రావు స్ఫూర్తితో గ్రామంలో అన్నిరంగాలలో అభివృద్ధి చేసి పార్టీకి ఎర్రజెండాకు వన్నె తెచ్చిన గొప్పవ్యక్తి బుగ్గవీటి రంగయ్య అప్పట్లో ఆయన నాయకత్వంలో పార్టీ నాయకులు మంద నారాయణ, చావా శంకరయ్య, రాయబారపు (బుడ్డయ్య), రామయ్య, జంపాల గురవయ్య, చింతకింది కోటయ్య, రాయబారపు(పిచ్చి) వెంకయ్య కోయ కోటేశ్వరరావు పనిచేసే పార్టీ అభివృద్ధికి పాటుపడ్డారు. 40 సంవత్సరాల కాలంలో పమ్మి గ్రామంలో ఎర్ర జెండాకు తిరుగులేకుండా పరిపాలించిన ఘనత బుగ్గవీటి వారి కుటుంబానిదే. ఆనాటి నుండి నేటి వరకు బుగ్గవీటి రంగయ్య కుటుంబసభ్యులు గ్రామానికి అనేక సేవలు అందిస్తున్నారు. గ్రామంలో పార్టీకి, ప్రజలకు సేవ చేస్తున్న క్రమంలో బుగ్గవీటి రంగయ్య అనారోగ్యా నికి గురై జూన్ 5 2008న తుదిశ్వాస విడిచారు. నేటికి(ఆదివారం) నాటికి 14 సంవత్స రాలు అయినా అమర వీరుడు రంగయ్య గ్రామంలో స్థూపంమై వెలుగుతూ నేడు కొట్లాటకు ఎర్రసైన్యంమై రగులు తూ ప్రజల గుండెల్లో సజీవంగా ఉన్నారు.
సిపిఐ(ఎం) నాయకులు, అమరజీవి, ఆదర్శ కమ్యూనిస్టు నేత బుగ్గవీటి రంగయ్య 14వ వర్ధంతి సభను మండల పరిధిలో పమ్మి గ్రామంలో ఆదివారం నిర్వహించేందుకు పార్టీ గ్రామశాఖ ఏర్పాటు ఏర్పాట్లు చేసింది. బుగ్గవీటి రంగయ్య స్తూపంను అలంకరణ చేసి ఎర్రతోరణాలు, జెండాలతో ముస్తాబు చేశారు. ఈ వర్ధంతి సభలో జిల్లా మండల నాయకులతో పాటు రంగయ్య కుటుంబ సభ్యులు పాల్గొంటారని సిపిఐ(ఎం) గ్రామశాఖ కార్యదర్శి చావా శ్రీనివాసరావు శనివారం తెలిపారు.