Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కల్లూరు
గ్రామీణ స్థాయిలో క్రీడలను ప్రోత్సహించడమే లక్ష్యంగా పెట్టుకొని ప్రతి గ్రామంలో క్రీడా ప్రాంగణాలు ఏర్పాటుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని సత్తుపల్లి శాసన సభ్యులు సండ్ర వెంకటవీరయ్య అన్నారు. శనివారం మండల పరిధిలోని కొర్లగూడెం గ్రామంలో ఏర్పాటు చేసిన గ్రామీణ క్రీడా ప్రాంగణాన్ని సత్తుపల్లి శాసనసభ్యులు సండ్ర వెంకట వీరయ్య, టీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు ఎమ్మెల్సీ తాత మధుతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య మాట్లాడుతూ ఊరుకో ''తెలంగాణ గ్రామీణ క్రీడా ప్రాంగణం'' పేరుతో క్రీడా ప్రాంగణాలను నిర్మించేందుకు అన్ని గ్రామాల్లో ఏర్పాట్లు జరుగుతున్నాయన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా కొర్లగూడెం గ్రామంలో గ్రామీణ క్రీడ ప్రాంగణాన్ని ప్రారంభించామన్నారు. గ్రామీణ క్రీడా ప్రాంగణంలో ఆహ్లాదమైన వాతావరణం కల్పించేందుకు మొక్కలలు వాటి రక్షణకు బయో పెన్సింగ్ ఏర్పాటు చేయడం, సకల సౌకర్యాలు ఏర్పాటు చేయడం పట్ల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చొరవ చూపుతుందన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ బైరెడ్డి.నరసింహారెడ్డి, సొసైటీ చైర్మన్ కీసర.వెంకటేశ్వరరెడ్డి, జడ్పిటిసి కట్ట అజరు కుమార్, ఎంపీపీ బీరవల్లి రఘు, కల్లూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ కాటంనేని వెంకటేశ్వరావు, సొసైటీ డైరెక్టర్ బోబోలు లక్ష్మణ్ రావు, కల్లూరు గ్రామ సర్పంచ్ లక్కినేని రఘు, రైతు సమన్వయ సమితి అధ్యక్షులు పసుమర్తి చంద్రరావు, మండల ప్రధాన కార్యదర్శి ప్రసాద్ తదితరులున్నారు.