Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అక్రమ పద్ధతుల్లో సిబ్బంది నియామకాలు
- విచారణ జరిపించాలని కార్మిక సంఘాలు డిమాండ్
నవతెలంగాణ-ఖమ్మం
నగర పాలక సంస్థలో అక్రమ పద్ధతుల్లో సిబ్బంది నియమించడం దొడ్డి దారిన ప్రమోషన్లు ఇవ్వడం సరైన పద్ధతి కాదని విచారణ జరిపించాలని కార్మికులకు రావాల్సిన ఏడు నెలల ఏరియల్స్ ఇవ్వకుండా కాలయాపన చేయకుండా వెంటనే చెల్లించాలని సీఐటియు జిల్లా అధ్యక్షులు తుమ్మా విష్ణువర్థన్, ఏఐటియుసి మున్సిపల్ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మందా వెంకటేశ్వర్లు, ఐఎఫ్టీయూ మున్సిపల్ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు జి.రామయ్య డిమాండ్ చేశారు. శనివారం ఖమ్మంలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో సీఐటీయూ జిల్లా కార్యాలయంలో మున్సిపల్ కార్మిక సంఘాల జేఏసీ ముఖ్యుల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో వారు మాట్లాడుతూ దేవుడు వరమిచ్చినా పూజారి కనికరించని చందంగా ఖమ్మం నగర పాలక సంస్థ పాలక వర్గం అధికారుల తీరు ఉందని కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించి చెల్లించమన్న ఏడు నెలల ఏరియల్స్ ఇంతవరకు చెల్లంచక పోవడం ఇందుకు నిదర్శనం అని విమర్శించారు. దీనికి తోడు నగరంలో రోజు రోజుకు పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా సిబ్బంది సంఖ్య పెంచాలని అనేక మార్లు కార్మిక సంఘాలు కార్మిలు ఆందోళనలు చేసినా స్పందించని పాలక వర్గం అధికారుల సిబ్బంది నియామకాలు చేపట్టకుండా అడ్డదారిలో కొంత మంది తాజా మాజీ కార్ఫోరేటర్ల అనుచరులను బందువులను నియమించి ప్రమోషన్లు ఇచ్చి సీనియారిటీ ప్రాతిపదికన కాకుండా ఇష్టానుసారంగా సిబ్బంది కి టెక్నికల్ వేతనాలు చెల్లిస్తున్నారన్నారు. ఇది అత్యంత దుర్మార్గమైన చర్యలని ఎద్దేవా చేశారు. పారిశుధ్య విభాగంలో పనిచేస్తున్న కార్మికులకు పనికి పనిముట్లు అనడిగితే ఇవ్వ కుండా కార్మికులనే కొనుగోలు చేసుకొమనడంతో చాలిచాలని వేతనాల్లో పనిముట్లు కూడా కార్మికులే తెచ్చుకుంటే ఎట్లా అని ప్రశ్నించారు. సంవత్సరానికి రెండు సార్లు కార్మికులకు సబ్బులు, నూనెలు, బట్టలు, చెప్పులు ఇతర సామగ్రి ఇవ్వాల్సి ఉండగా అతిగ తిలేదని అన్నారు. ఇప్పటికైనా నగర పాలక సంస్థలో జరుగుతున్న అక్రమ సిబ్బంది నియామక విషయంలో జిల్లా కలెక్టర్ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో సిఐటియు మున్సిపల్ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి జినక శ్రీను, నాయకులు దొడ్డా నర్సింహారావు, బి.ఉపేందర్, ఎఐటియుసి మున్సిపల్ కార్మిక సంఘం నాయకులు షేక్ హుస్సేన్, బి. పాపారావు. కె.మహేష్, ఐఎఫ్ టియు నాయకులు కొయ్యల. శ్రీనివాస్, కంకణాల శ్రీనివాస్, పాల్గొన్నారు.