Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఎర్రుపాలెం
మండల పరిధిలోని వివిధ గ్రామాలలలో శంకుస్థాపనలు ప్రారంభోత్సవాల కార్యక్రమాలలో జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమల్ రాజు ఆదివారం పాల్గొన్నారు. తెల్లపాలెం గ్రామ పంచాయతీ నందు సిమెంటు రోడ్డుకు శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించారు. అదే గ్రామ పంచాయతీ నందు పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వ పాఠశాలలో చీపురు పట్టి చెత్తను శుభ్ర పరిచారు. నూతనంగా నిర్మించినటువంటి వైకుంఠధామంను ప్రారంభించారు. కండ్రిక గ్రామ పంచాయతీ నందు నూతనంగా నిర్మించినటువంటి సిమెంటు రోడ్డును ప్రారంభించారు. మీనవోలు గ్రామ పంచాయతీ నందు నూతనంగా నిర్మించిన సిమెంట్ రోడ్డు ప్రారంభించారు. పలు కుటుంబాలను పరామర్శిం చారు. కార్యక్రమంలో గ్రామ పంచాయితీ సర్పంచులు పెరుగు రామకృష్ణ, భూక్య నాగ మణి, ఏమి రెడ్డి అనురాధ, మధిర మార్కెట్ కమిటీ చైర్మన్ చిత్తూరు నాగేశ్వరరావు, ఎంపీపీ శిరీష, జడ్పిటిసి కవిత, మండల అభివృద్ధి అధికారి శ్రీనివాసరావు, తాసిల్దార్ తిరుమలచారి, ఎంపీవో శ్రీలక్ష్మి, నాయకులు చావా రామకృష్ణ, మాజీ జెడ్పిటిసి అంకశాల శ్రీనివాసరావు, సొసైటీ చైర్మెన్ అక్కిరెడ్డి, మొగిలి అప్పారావు, టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు పంబి సాంబశివరావు, కొండ పాటి సాంబశివరావు తదితరులు పాల్గొన్నారు.