Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-భద్రాచలం
భద్రాచలం, బూర్గంపాడు మండలాలలో ఆదివారం సాయంత్రం ఉరుములు, మెరుపులతో ఈదురుగాలులతో భారీ వర్షం కురిసింది. సాయంత్రం ఆరు గంటల నుంచి కురుస్తున్న భారీ వర్షాలతో భద్రాచలంలోని పరిసర ప్రాంతాలు, శివారు ప్రాంతాలు వర్షపు నీటితో నిండి ఉన్నాయి. లోతట్టు ప్రాంతాలు వర్షపు నీటితో నిండి ఉన్నాయి. రామాలయ పరిసర ప్రాంతాలు వర్షపు నీటితో నిండిపోయాయి. ఈదురుగాలులతో ఉరుములు, మెరుపులతో భారీ వర్షం కురవడంతో భద్రాచలంలో విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. భద్రాచలంలో సాయంత్రం 6 గంటలకు విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది విద్యుత్ సరఫరాకు విద్యుత్ శాఖ అధికారులు, సిబ్బంది పనిచేస్తున్నారు. సుమారు రెండు గంటలు దాటుతున్నా ఇప్పటికీ భద్రాచలంలో విద్యుత్ సరఫరా లేక భద్రాద్రి చీకటిలో వుంది.
గాలివాన బీభత్సం....
అశ్వాపురం మండలంలో ఆదివారం గాలివాన బీభత్సం సృష్టించింది. సాయంత్రం ఐదు గంటల నుండి ఆరు గంటల వరకు ఉరుములతో కూడిన వర్షపాతం నమోదయింది. భారీ ఉరుములతో కూడిన వర్షం, పిడుగులు కూడా పడ్డాయి. మండల పరిధిలోని అమెర్ధ సమీపంలో ఓ చెట్టు పై పిడుగు పడటంతో పెద్దఎత్తున మంటలు ఎగిసిపడ్డాయి. వర్షం వలన విద్యుత్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. పలుచోట్ల చెట్లు విరిగి విద్యుత్ వైర్లపై పడడంతో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో మండల కేంద్రంలోని వ్యాపార వర్గాలతో పాటు ప్రజలు సైతం తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొన్నారు.