Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పల్లె ప్రగతి రాష్ట్ర ప్రత్యేక అధికారి జగత్ కుమార్ రెడ్డి
నవతెలంగాణ-చండ్రుగొండ
గ్రామీణ ప్రాంతాల్లో ఇంకుడు గుంతలు నిర్మించుకునేలా ప్రజలకు అవగాహన కల్పించాలని, ఇంకుడు గుంతల నిర్మాణాలతో భూగర్భ జలాలు పెంపొందుతాయని గ్రామీణాభివృద్ధి రాష్ట్ర జాయింట్ కమిషనర్, పల్లె ప్రగతి రాష్ట్ర ప్రత్యేక అధికారి జగత్ కుమార్ రెడ్డి అన్నారు. ఆదివారం మండలంలోని తిప్పన పల్లి గ్రామంలో పల్లె ప్రగతి పనితీరును ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా గ్రామంలో రహదారి పక్కన ఆ మురుగు జలాలను ఆయన పరిశీలించారు. రహదారి పక్కన మురుగు కాలువలు లేకుండా చూడాలన్నారు. గ్రామంలోని అందరూ ఇంకుడు గుంతలు నిర్మించుకుంటే మురుగునీరు ఎలా బయటకు వస్తుంది అన్నారు. ప్రతి ఒక్కరూ ఇంకుడు గుంతలు నిర్మించుకునేలా అవగాహన కల్పించారు. తడి, పొడి చెత్త వేరు చేసి సేంద్రియ ఎరువులు చేయాలన్నారు. నిర్మించిన వీటిని ప్రజలు ఉపయోగించుకునే చూడాలన్నారు. తిప్పన పల్లి గ్రామంలో ప్రగతి కార్యక్రమాలను పరిశీలించారు. పల్లె ప్రకృతి వనంలో ఆయన మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో అన్నపూర్ణ, మండల ప్రత్యేక అధికారి సంజీవరావు, ఏపీవో రామచందర్, ఎంపీడీవో తోట తులసిరామ్, ఉపసర్పంచ్ రామారావు తదితరులు పాల్గొన్నారు.
పల్లెల్లో ప్రగతి చూపించాలి
అన్నపురెడ్డిపల్లి : పల్లెల్లో పచ్చదనంతో పాటు ప్రగతి కూడా ఉండే విధంగా అధికారులు చూడాలని పల్లె ప్రగతి రాష్ట్ర ప్రత్యేక అధికారి జగత్ కుమార్ రెడ్డి అన్నారు. పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా మండల పరిధిలోని అబ్బుగూడెం పంచాయతీలో ఆయన పర్యటించి పల్లె ప్రకృతి వనాన్ని డంపింగ్ యార్డుని పరిశీలించారు. ఈ కార్యక్రమంలో డీపీఓ లక్ష్మి రమాకాంత్, ఎండీఓ రేవతిఓ, పంచాయతీ కార్యదర్శలు శాంతి, విజయలక్ష్మి, ఆర్ఐ మధు తదితరులు పాల్గొన్నారు.