Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆర్డీఓ స్వర్ణలత
నవతెలంగాణ-అశ్వారావుపేట
పల్లె ప్రగతిలో విద్యుతీకరణ ప్రధాన భూమిక వహిస్తుందని అందుకోసం ప్రతీ ఆవాసంలోనూ వీధి లైట్లు, వ్యవసాయ పంపు సెట్లుకు విద్యుత్ అంతరాయం లేకుండా చూడాలని పల్లె ప్రగతి అశ్వారావుపేట మండల ప్రత్యేక అధికారి ఆర్డీఓ స్వర్ణలత ఆ శాఖ మండల అధికారులకు ఆదేశాలు జారీ చేసారు. ఆదివారం స్థానిక మండల పరిషత్ కార్యాలయం సమావేశం మందిరంలో గ్రామ స్థాయి అధికారులకు పల్లె ప్రగతి అమలుపై అవగాహన, సమీక్ష నిర్వహించారు. ఎండీఓ విద్యాధర రావు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ఆర్డీఓ ముఖ్య అతిథిగా పాల్గొని పల్లె ప్రగతి కార్యాచరణపై పలు సూచనలు చేసారు. విద్యుత్ సరఫరాకు చెంది ప్రతీ సమస్యను గుర్తించి దాని పరిష్కారానికి చర్యలు చేపట్టాలని విద్యుత్ అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో పలు కీలక శాఖల అధికారులు, కార్యదర్శులు పాల్గొన్నారు.