Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పల్లె ప్రగతి పనులను పరిశీలించిన ప్రజాప్రతినిధులు
నవతెలంగాణ-భద్రాచలం(బూర్గంపాడు)
గ్రామాల అభివృద్ధిలో ప్రతిఒక్కరూ తమ వంతు సహాయ సహకారాలు అందించాలని జడ్పీటీసీ కామిరెడ్డి శ్రీలత, సర్పంచ్ సిరిపురపు స్వప్నలు అన్నారు. ఆదివారం మండల కేంద్రమైన బూర్గంపాడులో పల్లెప్రగతి పనులు చేపట్టారు.
ఈ పనులను వారు, తహశీల్దార్ భగవాన్ రెడ్డి, ఎంపీడీవో వివేక్రామ్, ప్రజాప్రతినిధులు పరిశీలించారు. గ్రామ పంచాయతీలో జరుగుతున్న పారిశుధ్య పనులు, సైడ్ డ్రైన్లలో పూడికతీత పనులను వారు పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ పార్టీ మండల కార్యదర్శి జక్కం సుబ్రమణ్యం, నాయకులు, పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు.